2018లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆసీస్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ చేశారు. శాండ్ పేపర్ వాడి బంతి రూపం మార్చేందుకు బాన్ క్రాఫ్ట్ ప్రయత్నించాడు. ఈ విషయంలోనే అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మరో ఆటగాడు బాన్ క్రాఫ్ట్ కూడా ఇరుక్కున్నారు. బాల్ టాంపరింగ్ చేసినట్లు వారు ఒప్పుకోవడంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్నారు. బాన్ క్రాఫ్ట్‌కు 9 నెలల నిషేధం ఏర్పడింది. అయితే ఇటీవల స్మిత్, వార్నర్ జట్టులోకొచ్చారు. కానీ బాన్ క్రాఫ్ట్ జట్టులోకి రాలేకపోయాడు. అయితే తాజాగా బాన్ క్రాఫ్ట్ అప్పటి బాల్ టాంపరింగ్ విశేషాలకు సంబంధించి అనేక సంచలన విషయాలు వివరించాడు. తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌లు కూడా దీనిపై మాట్లాడారు.
ఈ విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాన్ క్రాఫ్ట్ బాంబు పేల్చాడు. తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని మరో బాంబు పేల్చాడు. గిల్ క్రిస్ట్ చెప్పిన ఈ విషయం ప్రస్తుతం ఆసీస్ క్రికెట్లో సంచలనంగా మారింది.
కాగా.. ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. ఆ రోజు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా కొంతమందిని తెలిసినా ఆశ్చర్యం లేదని చెపపుకొచ్చాడు.