టీమిండియా యువ ఆల్‌రౌండర్లలో విజయ్ శంకర్ కూడా ఒకడు. అయితే ఆల్‌రౌండర్ అయినా.. ప్రపంచంకప్ వంటి కీల టోర్నీల్లో స్థానం సంపాదించుకున్నా.. ఒక్కసారి కూడా స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో వచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులోకొచ్చినా.. ఒక్కసారి కూడా అటు బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ ఒక్కసారి కూడా రాణించలేకపోయాడు. ఇక ఫీల్డింగ్‌లో కూడా చాలా సార్లు దారుణంగా విఫలమయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ కనీస ప్రదర్శన చేయలేకపోయాడు. అంతేకాదు ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ ఒక్కసారి కూడా బౌలింగ్ కూడా చేయలేదంటే ఎంత విచిత్రమో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్లైన కలిస్, వాట్సన్‌లతో పోల్చుకున్నాడు. దీంతో టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ శంకర్ మాట్లాడుతూ.. తాను టీమిండియాకు కలిస్, షేన్ వాట్సన్ లాంటి ఆల్‌రౌండర్‌నంటూ తనను తానే తెగ పొగిడేసుకున్నాడు. దిగ్గజ ఆల్‌రౌండర్లలానే తాను కూడా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడినని, ఎటువంటి సందర్భంలోనైనా బౌలింగ్ చేయగల సత్తా తనలో ఉందని చెప్పుకొచ్చాడు.
Indian fans after Vijay Shankar’s statement: pic.twitter.com/cF4hh4skS9
— Tanishq Ganu (@smart__leaks) May 17, 2021
Kallis and Watson reaction after Vijay Shankar’s comment pic.twitter.com/fk8fmlvqGh
— Simran Kaur (@kaursimran_ind) May 17, 2021
This banged. Follow @KingShawEra for Vijay Shankar prop.
— The Beautiful game (@Leg_Gully) May 18, 2021
విజయ్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు విపరీతంగా అతడిని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విటర్ వేదికగా సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తూ చివాట్లు పెట్టారు. వాట్సన్, కల్లిస్.. ఇద్దరితో కనీసం ఏ మాత్రం దగ్గరలో కూడా లేవని, అలాంటి వ్యక్తులతో నిన్ను పోల్చుకోవడం చాలా ఫన్నీగా ఉందని కామెంట్లు చేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంచనాలకు తగ్గట్లు రాణించలేదని, అలాంటి నీవు వాట్సన్, కల్లిస్‌లతో పోల్చుకోవడం మానేయమని సలహాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు.