Friday, November 1, 2024

ఇక చెమట పట్టకుండా వైద్యం.. డాక్టర్లకు కూల్ కిట్లు!!

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం గతేడాది అల్లకల్లోలం అయింది. కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఏడాది ఈ మహమ్మారికి భారత దేశం వణికిపోతోంది. దీని బారిన పడుతున్న లక్షల మందిని కాపాడడం కోసం.. డాక్టర్లు, నర్సులు నిద్రాహాలుమాని కష్టపడుతున్నారు. అనుక్షణం చెమటోడ్చుతున్నారు. కనీసం ఊపిరి కూడా తీసుకోకుండా నిండుగా పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో క్షణక్షణం చెమటతో పూర్తిగా తడిచితున్నారు. అయినా దానిని భరిస్తూనే వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం వారికి ఓ తీపికబురందింది.

ఒళ్లంతా చెమటతో నిండిపోతూ కష్టపడుతున్న డాక్టర్లు, నర్సులకు చల్లని పీపీఈ కిట్లు అందనున్నాయి. కోవ్‌ – టెక్‌ వెంటిలేషన్‌ వ్యవస్థతో కూడిన ఈ పీపీఈ కిట్లు ధరిస్తే ఫ్యాన్‌ కింద కూర్చొన్నట్లు ఉంటుందట. ఈ విషయాన్ని ఆవిష్కర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ముంబైలోని కేజే సోమయ్య కళాశాలలో 2వ సంవత్సరం ఇంజనీరింగ్‌ చదువుతున్న నిహాల్‌సింగ్‌ అనే విద్యార్థి ఈ ‘కూల్ పీపీఈ కిట్లు’ రూపొందించాడు. తన తల్లి కూడా వైద్యురాలే కావడం, ఆమె ప్రతి రోజూ పీపీఈ కిట్లు ధరించి కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు. ఆమె ప్రతి రోజూ చెమటతో నిండిపోతోంది. ఈ క్రమంలోనే తన తల్లి కష్టం తొలగించాలనే నిహాల్ అనుకున్నాడు. అదే ఈ కూల్‌కిట్‌ ఆవిష్కరణకు దారితీసింది.

‘కరోనా యుద్ధవీరులైన ఆరోగ్య కార్యకర్తలు.. కోవ్‌ – టెక్‌ సౌకర్యంతో ఉన్న పీపీఈ కిట్‌ ధరించడం వల్ల ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. కోవ్‌ – టెక్‌ వెంటిలేషన్‌ వ్యవస్థ పీపీఈ సూట్‌ను పూర్తి విభిన్నంగా మార్చుతుంది. పీపీఈ సూట్‌ ధరించిన వారికి ఎంతో సౌకర్యంగా, సౌలభ్యంగా, ఫ్యాన్‌ కింద కూర్చుకున్నట్టుగా హాయిగా ఉంటుంది’ అని నిహాల్‌ వెల్లడించాడు.

సాధారణ పీపీఈ కిట్లతో కూడా కోవ్ – టెక్ కిట్ ధరించొచ్చని, వివిధ రకాల ఫంగస్‌ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం కోవ్‌ – టెక్‌లో వెంటిలేషన్‌ వ్యవస్థలో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విడిభాగాలను ఉపయోగించామని నిహాల్‌ చెప్పారు. ప్రొటోటైప్‌ నమూనా రూపకల్పన, ఉత్పాదన తయారీ కోసం నేషనల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ హార్నెసింగ్‌ ఇన్నొవేషన్స్‌(నిధి) సంస్థ నుంచి రూ. 10,00,000 నిహాల్‌కు అందడంతో ఈ ఆవిష్కరణ సాధ్యమైందని చెప్పారు. కోవ్‌ – టెక్‌ వెంటిలేషన్‌ వ్యవస్థ కోసం నిహాల్‌ ‘వాట్‌ టెక్నొవేషన్స్‌’ అనే స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. ఇప్పటికే 40 దాకా యూనిట్లను దేశవ్యాప్తంగా డాక్టర్లకు, ఎన్‌జీవోలకు అందించినట్లు చెప్పారు. మరో 100 యూనిట్లు తయారవుతున్నాయని, జూన్‌లో ఉత్పత్తిని పెంచి వాణిజ్యపరంగా మార్కెట్లోకి వెళ్లాలని భావిస్తున్నామని నిహాల్‌ వెల్లడించారు.

నడుముకు తగిలించుకునే బెల్ట్‌కు గుండ్రటి ఓ పరికరం ఉంటుంది. ఇందులో ఫ్యాన్‌ ఉంటుంది. ఈ ఫ్యాన్‌ నుంచి పీపీఈ కిట్‌కు గాలిని తీసుకెళ్లే ట్యూబ్‌లు అనుసంధానమై ఉంటాయి. అత్యంత భద్రమైన ఫిల్టర్ల ద్వారా గాలి లోపలికి వెళుతుంది. కరోనా వైరస్‌తో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు కలిగించే క్రిములు, వైరస్ అయినా ఇక్కడ పూర్తిగా ఫిల్టర్ అవుతాయి. అలా స్వచ్ఛమైన గాలి ఈ ఫ్యాన్‌ ద్వారా పీపీఈ కిట్ల లోపలికి వెళుతుంది. దీంతో డాక్టర్లు చెమటల్లో పూర్తిగా తడుస్తూ వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఇక ఉండదు. అలాగే ఈ మొత్తం వ్యవస్థను ఎయిర్‌ సీల్‌గా ఉంటుంది. ఇది పూర్తిగా బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీ 6 నుంచి 8 గంటలు వస్తుంది. పీపీఈ కిట్‌ వేసుకొని… కోవ్‌ – టెక్‌ను ఆన్‌చేస్తే కేవలం 100 సెకన్లలో తాజా చల్లగాలి సూట్‌ ధరించిన వారికి అందుతుంది.

కాగా.. కోవ్‌ – టెక్‌ ధర రూ.5,499 మాత్రమే. భారీస్థాయిలో ఉత్పత్తి చేపట్టినపుడు దీన్ని ఇంకా తగ్గించాలని చూస్తున్నారు. ఇలాంటివే ఇతర పరికరాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల దాకా ఉండడం గమనార్హం.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x