కరోనా మహమ్మారిని చైనా ల్యాబుల్లోనే తయారు చేశారంటూ గతేడాది నుంచి ఎన్నో దేశాలు ఆరోపిస్తున్న విషయం చెలిసిందే. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాడ్ ట్రూమ్ అయితే ఏకంగా దీనిని చైనా వైరస్ అనే సంబోధించారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే సరైన ఆధారాలు లభించలేదు. డబ్ల్యుహెచ్ఓ బృందం సైతం వెళ్లి ఊహాన్ ల్యాబుల్లో తనిఖీలు చేసిన సరైన ఆధారాలు దొరకలేదు. అయితే తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఈ అనుమానాలను నిజం చేసే విధంగా ఉంది.
కరోనా వైరస్ పుట్టుకకు తమకు ఎటువంటి సంబంధం లేదని చైనా చెబుతున్నా.. ఈ విషయాన్ని నమ్మేందుకు చాలా దేశాలు సిద్ధంగా లేవు. ఈ క్రమంలోనే అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టులో కరోనా గురించి చైనా ఎన్నో విషయాలను ప్రపంచం కళ్లపడకుండా దాచిందని చెప్పడం సంచలనంగా మారుతోంది.
చైనా ఇప్పటివరకు తమ దేశంలో తొలి కేసు 2019 డిసెంబర్‌లో నమోదయింది. కానీ అంతకుముందే కరోనాతో కొందరు ఆసుపత్రిలో చేరారని ఈ రిపోర్టు ప్రకారం తెలుస్తోంది. ఉంది. ఈ మహమ్మారిని ఊహాన్ ల్యాబ్‌లో చైనానే సృష్టించిందని, ప్రపంచ దేశాలపై వదిలిందని అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ప్రపంచ దేశాలు చైనాను ప్రశ్నించాయి. కానీ కరోనాకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనేక దేశాలు తమపై అర్థంలేని ఆరోపణలు చెస్తున్నాయని చైనా పేర్కొంది.
అయితే అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కరోనా ప్రపంచానికి పరిచయం కాకముందే చైనా ఊహాన్ ల్యాబ్‌లో చాలా మంది శాస్త్రవేత్తలు అనారోగ్యం బారిన పడ్డారు. వారందరిలోనూ కరోనా లక్షణాలే ఉన్నాయి. ఈ సమాచారం ప్రకారం చైనా పక్కా ప్లాన్‌తోనే కరోనాను తయారు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
చైనాలో కరోనా బయటపడగానే ఊహాన్ ల్యాబుల్లోనే రికార్డులను చైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆ రికార్డుల్లో ఉన్న సమాచారం బయటకు రావడం లేదు. ఆ సమాచారం బయటకు వవస్తేనే కరోనాను ఎవరు తయారు చేశారో తెలుస్తుందిని అమెరికా ఇంటెలిజెన్స్ అంటోంది. ఊహాన్ ల్యాబ్ రికార్డులను ఎవ్వరికీ అందకుండా చేయడం, డబ్ల్యూహెచ్ఓ బృందం పరిశీలనకు వెంటనే అనుమతి ఇవ్వకపోవడం వంటి విషయాలన్నీ చైనాపై అనుమానాలను బలపరుస్తున్నాయి. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా చైనా స్పందించడం లేదు. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.