Friday, November 1, 2024

‘వన్డే కెప్టెన్సీ రోహిత్‌కివ్వండి’ మాజీ కీపర్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఎంత గొప్పగా రాణిస్తున్నాడో వేరే చెప్పక్కర్లేదు. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో మంచి కెప్టెన్సీతో దూసుకెళుతున్నాడు. అయితే దీనివల్ల అతడిపై ఒత్తిడి పెరుగుతోందని, అందువల్ల స్ల్పిట్ కెప్టెన్సీని అమలు చేయాలని అనేకమంది క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఇవ్వాలనేది వారిలో కొందరి మాట. టెస్టుల్లో కోహ్లీ బెస్ట్ అని, అయితే వన్డే, టీ20ల్లో మాత్రం కెప్టెన్సీ రోహిత్‌‌కు ఇస్తే మరింత గొప్పగా జట్టు రాణిస్తుందని వారి అభిప్రాయం. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ కిరణ్ మోరే కూడా చేరాడు.

రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలనే అభిప్రాయానికి కిరణ్ మోరే మద్దతు పలికాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు స్వయంగా తన కెప్టెన్సీని రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉంటే తప్పేంటని మోరే ప్రశ్నించాడు. బీసీసీఐ తన సూచనలను పరిగణలోకి తీసుకుంటుందనే ఆశిస్తున్నానని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్సీతో పోలిస్తే.. రోహిత్ సారథ్యం మెరుగ్గా ఉంటుందని, ఇందుకు ఐపీఎల్‌లో రోహిత్ సాధించిన విజయాలే నిదర్శనమని మోరే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘టెస్టుల్లో కోహ్లీ.. వన్డే, టీ20లకు రోహిత్ కెప్టెన్లుగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్సీ బాధ్యతల్ని కోహ్లీ రోహిత్​తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లుంటుంది. టాలెంట్‌కు కొదవ లేని భారత్ లాంటి దేశంలో ఒక్కో ఫార్మాట్​కు ఒక్కో కెప్టెన్​ అనే పంథా కచ్చితంగా మంచి ఫలితాలనిస్తుంది.

కాగా, భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా రెండు జాతీయ జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఓ జట్టు విరాట్ కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ కోసం జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుండగా.. మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్టుకు కెప్టెన్ ఎవరనే విషయం ఇంకా తెలియలేదు. అయితే కోహ్లీ సేనకు ఎప్పటిలానే రవిశాస్త్రి కోచ్‌గా ఉండనుండగా.. శ్రీలంక వెళ్లే జట్టుకు రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x