Sunday, March 22, 2026

‘వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నా..’ రోహిత్‌

బ్యాట్స్‌మన్ బౌండరీ బాదగానే ప్రేక్షకుల అరుపులతో స్టేడియం దద్దరిల్లాలి. బౌలర్ వికెట్ తీయగానే అభిమానుల కేకలతో గ్రౌండ్ మారుమోగిపోవాలి. ఫీల్డర్ డైవ్ చేసి బౌండరీ ఆపి సూపర్ ఫీల్డింగ్ చేసినా.. అదిరిపోయే క్యాచ్ పట్టినా.. ఫ్యాన్స్ కేరింతలతో చీర్ చేయాలి. అయితే కరోనా దెబ్బకు ఇవన్నీ క్రికెట్‌కు దూరమై ఏడాది దాటిపోయింది. రెండో ఏడాదిలో కూడా ప్రేక్షకుల కేరింతలు మైదానాల్లో అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నా.. క్రికెటర్లలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ఓపెనర్‌, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘ఫ్రెండ్స్’ కామెడీ సిరీస్ అంటే తెలియని వారుండరు. అమెరికాకు చెందిన ఈ కామెడీ సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై డైరెక్టర్ బెన్ వింట్స‌న్ ఇటీవల ‘ఫ్రెండ్స్‌:దీ రీయూనియన్‌’ అనే సిరీస్‌ ఈ రోజే(గురువారం) విడుదల చేశారు. భారత్‌లో కూడా ఇది విడుదలైంది. ఈ సిరీస్‌లో స్నేహితులైన పాత్రలన్నీ చాలా కాలం తర్వాత తిరిగి కలుసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. చివరికి కలుస్తారు. ఈ క్రమంలోనే దీనిపై రోహిత్‌ ఓ ట్వీట్‌ చేశాడు. తాను ఎవరిని కలుసుకోవాలని అనుకుంటున్నాడో అందులో చెప్పాడు.

‘F.R.I.E.N.D.S.. నేను వేచి చూసేది మీకోసమే’ అనే కొటషన్‌ను ట్వీట్ చేసిన రోహిత్.. దానికి 2019 వన్డే ప్రపంచకప్‌ నాటి ఓ ఫొటోను ట్వీట్‌ చేశాడు. ఆ మెగా టోర్నీలో హిట్‌మ్యాన్‌ 9 మ్యాచుల్లో 81 సగటుతో 648 పరుగులు చేయడమే కాకుండా రికార్డు స్థాయిలో 5 శతకాలు సాధించి టీమిండియా సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అందులో ఒక సెంచరీ చేశాక అభిమానులను చూస్తూ హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ పైకెత్తిన ఫొటోనే రోహిత్ ఇప్పుడు ట్వీట్ చేశాడు. మైదానంలో మళ్లీ అభిమానుల మధ్య తాను మ్యాచ్ ఆడాలనుకుంటున్నానని, ప్రేక్షకుల సందడి మధ్య సెంచరీ చేయాలనుకుంటున్నానని అతడి అంతరార్థం అన్నమాట. మరి రోహిత్ ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -