దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తుంటే మరోపక్క పెట్రోల్ ధరలు సామాన్యులను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కొద్దిగా తగ్గినా.. మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర ఇప్పటికే అనేకచోట్ల రూ.100 దాటేసింది. అయితే పెట్రో ధరలు మన దేశంలో ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం అత్యంత చవుకగా దొరుకుతోంది. అందులో కొన్ని దేశాల్లో మంచి నీళ్లకంటే పెట్రోల్ తక్కువ ధరకు దొరికితే.. మరికొన్ని దేశాల్లో చిన్నపిల్లలు కొనుక్కునే చాక్లెట్ ధరకే దొరుకుతోంది. నమ్మడం లేదా..? అయితే ఈ వార్త చదవండి.
1. వెనిజులా
ప్రపంచంలో అత్యంత భారగా చమరు నిల్వలున్న దేశం వెనిజులా. అందుకే ఇక్కడ పెట్రోలు అత్యంత చవకగా దొరుకుతుంది. ఇక్కడ ఒక బాటిల్ నీరు కొనుక్కోవడం కన్నా లీటరు పెట్రోలు కొనుక్కోవడం చవక. ఇంతకీ ఇక్కడ లీటరు పెట్రోలు ఎంతో తెలుసా? 0.02 డాలర్లు అంటే మన లెక్కల్లో 1.45 రూపాయలన్నమాట.
2. ఇరాన్
ప్రపంచానికి చమురు ఎగుమతులు చేసే ముఖ్యమైన దేశాల్లో ముస్లిం కంట్రీ ఇరాన్ ఒకటి. మే నెలలో ఇరాన్ చమురు ఎగుమతులు కొత్త రికార్డులు సృష్టించాయి. మొత్తమ్మీద రోజుకు 2.7 మిలియన్ల బ్యారెల్స్ చమురు ఎగుమతులు చేసిందీ దేశం. 2016లో ఈ దేశంపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఇదే రికార్డు. ఇక్కడి నుంచి ప్రపంచానికి చమురు దొరుకుతుండటంతో.. స్థానికంగా పెట్రోలు వంటి ఇంధనాలకు కొరత లేదు. ఇక్కడ లీటరు పెట్రోలు 0.06 డాలర్లు (4 రూపాయల 34 పైసలు) పలుకుతుంది.
3. సూడాన్
ఆఫ్రికా దేశం సూడాన్‌లో కూడా పెట్రోలు చవకే. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురు ఉత్పత్తి మీదే ఆధారపడి ఉందనడం అతిశయోక్తి కాదు. ఈ దేశం చేసే అధికశాతం ఎగుమతులు కూడా ఆయిలే. అందరికన్నా ఆలస్యంగా ఈ బిజినెస్‌లో దిగింది ఈ దేశమే అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి ప్రపంచానికి 1999లో చమరు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ లీటరు పెట్రోలు ధర సుమారు రూ.31.85 (0.44 అమెరికా డాలర్లు) ఉంది.
4. కువైట్
గల్ఫ్ దేశం కువైట్ ఆర్థిక వ్యవస్థ కూడా ఆయిల్ ఆధారితమే. ఇక్కడ 94 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయి. అందుకే ఇక్కడ పెట్రోలు ధర పెద్దగా ఉండదు. కేవలం 0.38 డాలర్లు (సుమారు రూ.27.51) మాత్రమే.
5. అల్జీరియా
అంతర్జాతీయ గ్యాస్, ఆయిల్ మార్కెట్లో కీలక పాత్ర పోషించే దేశం అల్జీరియా. ఆఫ్రికాలో అతిపెద్ద గ్యాస్ ఎగుమతి దేశం. చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, టర్కీ తదితర ప్రధాన దేశాలన్నింటికీ ఇక్కడి నుంచి గ్యాస్ దొరుకుతుంది. ఇక్కడ కూడా పెట్రోలు ధర తక్కువే. కేవలం 0.34 డాలర్లు మాత్రమే. అంటే మన లెక్కల్లో రూ.24.61గా ఉంది.
6. ఈక్వెడార్
ఈ దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ చమురు ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. దేశంలో మొత్తం మూడు చమురు నిల్వల రిఫైనరీలు, మూడు డిస్టిల్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ లీటరు పెట్రోలు 0.526 డాలర్లుగా ఉంది. అంటే దాదాపు 38 రూపాయలన్నమాట.
7. నైజీరియా
ఆఫ్రికాలో అతి పెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు నైజీరియా. ఒక్కడ 1956లో షెల్ డి ఆర్కీ అనే పరిశోధకుడు ఓలోబిరి ప్రాంతంలో చమురు నిల్వలు కనుగొన్నాడు. ఆ తర్వాత ఈ రంగంపై దృష్టి పెట్టిన దేశం 1958 నుంచి చమురు ఎగుమతులు ప్రారంభించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.406 డాలర్లు. అంటే దాదాపు రూ.29.39 అన్నమాట.
8. ఈజిప్ట్
పిరమిడ్ల దేశం ఈజిప్టులో కూడా పెట్రోలు చవకే. 20వ శతాబ్దం ఆరంభంలో ఇక్కడ చమురు నిల్వలు కనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ రంగంపై ఫోకస్ పెట్టిన ఈజిప్టు.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కీలకమైన సహజవాయు ఉత్పత్తి దారు. ఇక్కడ పెట్రోలు ధర లీటరు 0.55 డాలర్లుగా ఉంది. అంటే రూ. 39.82 అన్నమాట.
9. తుర్కమెనిస్తాన్
ఆసియా అంచుల్లోని ఈ దేశం.. ప్రపంచంలో సహజవాయువుల ఉత్పత్తి అత్యధికంగా ఉంది ఇక్కడే. ప్రస్తుతం ఇది టాప్ 20లో కూడా ఉండడు. ఇక్కడ లీటర్ పెట్రోలు ధర 0.428 డాలర్లు (30.98 రూపాయలు) గా ఉంది.
10. అజెర్‌బైజాన్
ఇది ప్రపంచంలోని ముఖ్యమైన చమురు వ్యవస్థల్లో ఇది ఒకటి. ఈ దేశ చముర రంగానికి 150 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ దేశంలో అధిక శాతం చమురు శుద్ధి పరిశ్రమలు సాబుంచీ, సురాఖనీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ లీటరు పెట్రోలు ధర రూ.0.588 డాలర్లు. అంటే 42.57 రూపాయలన్నమాట.