Friday, November 1, 2024

వివాహేతర సంబంధం ఉన్నా చెడ్డ తల్లి కాదు: హైకోర్టు తీర్పు

చండీగఢ్‌: బిడ్డలంటే తల్లికి ఎంత ప్రేమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వారి కోసం తన సర్వస్వాన్ని ధారబోస్తుంది. ఓ మహిళగా ఆమె ఏదైనా తప్పులు చేసినా.. తల్లిగా మాత్రం బిడ్డకు ఏ కష్టం రానివ్వదు. ఇదే విషయాన్ని హర్యానా-పంజాబ్ హై కోర్టు తాజాగా తన తీర్పు ద్వారా వెల్లడించింది. వివాహేతర సంబంధం ఉందంటూ.. ఓ భర్త తల్లి నుంచి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో ఆ మహిళ హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. దీని విచారణ సందర్భంగా జస్టిస్‌ అనుపిందర్‌ సింగ్‌ గ్రెవాల్‌ ఈ విధంగా తీర్పునిచ్చారు. ‘‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ నైతిక స్వభావంపై నిందలు మోపడం చాలా సహజం. ఎలాంటి ఆధారం లేకుండా మహిళ వ్యక్తిత్వంపై బురద జల్లుతారు. స్త్రీకి వివాహేతర సంబంధం ఉన్నా.. ఉందని ఊహించినా.. దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను మంచి తల్లి కాదని అనడానికి కానీ.. పిల్లలను ఆమె నుంచి దూరం చేయడం కానీ జరగదు’’ అని తీర్పునిచ్చారు.

పంజాబ్‌‌కు చెందిన ఫతేగార్‌ సాహిబ్, ఆమె భర్త ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులు. 2013లో వీరికి వివాహమైంది. 2017లో వీరికి ఓ పాప పుట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆమె భారత్ వచ్చినప్పుడు ఆమె దగ్గర నుంచి కుమార్తెను బలవంతంగా వేరు చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ తన భర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, కానీ తాను ఆస్ట్రేలియాలో బాగానే స్థిరపడ్డానని, సొంత ఇల్లు కూడా ఉందని, కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని, అందువల్ల ఆమెను తనతో పంపించాలని పిటీషన్‌లో పేర్కొంది. మైనర్‌ కుమార్తె బాధ్యతను తనకు అప్పగించేలా తన భర్తను ఆదేశించాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. ఇదే విషయంలో ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టులోనూ ఆమె పిటీషన్‌ దాఖలు చేసింది. అక్కడి కోర్టు ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. మైనర్ బిడ్డను మహిళకు తిరిగి ఇవ్వమని ఆస్ట్రేలియా కోర్టు భర్తను ఆదేశించింది.

అయితే భర్త మాత్రం..తన భార్య దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందుకే పాపను ఆమె దగ్గర నుంచి తీసుకువచ్చానని కోర్టుకు చెప్పాడు. ఏడాదిగా తన కుమార్తె నానమ్మ, తాతయ్యల దగ్గర బాగా అలవాటయ్యిందని, ఇప్పుడు బిడ్డను తన భార్యకు అప్పగిస్తే పాపపై ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు.. ‘‘తల్లి నాలుగున్నరేళ్ల కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోరుతుంది. రానున్న సంవత్సారల్లో పాప నిర్మాణాత్మక అభివృద్ధిలో తల్లి ప్రేమ, సంరక్షణ, ఆప్యాయత, మార్గదర్శకత్వం అవసరం అవుతాయి. అంతేకాక హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ చట్టం, 1956 లోని సెక్షన్ 6 ప్రకారం తల్లి ఐదేళ్ల వయస్సు వరకు పిల్లల సహజ సంరక్షకురాలు” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x