టీమిండియా మెన్స్, విమెన్స్ జట్లు గురువారం ఇంగ్లండ్ చేరుకున్నాయి. ముంబై నుంచి జూన్ 2 బుధవారం బయలుదేరిన టీమిండియా జట్లు 3వ తేదీనాటికి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం చేరుకున్నాయి. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఆటగాళ్లంతా సౌతాంప్టన్‌కు తరలించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న కరోనా ఆంక్షల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లంతా క్వారంటైన్‌లో ఉన్నాడు. మూడు రోజుల పాటు వీరి క్వారంటైన్ కొనసాగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానం సమీపంలో ఉన్న ‘హిల్టన్’ హోటల్‌లోనే టీమిండియా సభ్యులు బస చేస్తున్నారు. ప్రస్తుతానికి నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు హోటల్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత సహచరుడు రిషభ్ పంత్‌తో కలిసి రోహిత్ శర్మ ‘వీ ఆర్ ఇన్ సౌతాంప్టన్’ అని హోటల్ బాల్కనీలో ఉన్న ఫొటోతో ట్వీట్ చేశాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇదే మైదానంలో పురుషుల జట్టు ప్రాక్టీస్ చేస్తుంది.
కాగా.. ముంబైలో 14 రోజుల కఠిన క్వారంటైన్ తర్వాతే పురుషులు, మహిళల జట్లు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు వెళ్లాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్ల విమాన ప్రయాణాన్ని బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘జర్నీలో గాఢంగా నిద్ర పోయాను. అక్కడ కూడా క్వారంటైన్ తప్పదు. అయితే ఆ 3 రోజులూ మేం కలిసి మాట్లాడుకోవద్దని ఆదేశాలున్నాయి’ అని చెబూతూ అక్షర్ పటేల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా కొందరు తామ తమ హోటల్ బాల్కనీల నుంచి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్
చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే టీమిండియా- న్యూజిల్యాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్న కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. దీంతో ఆ జట్టుకు మంచి ప్రాక్టీస్ లభిస్తోంది. అయితే టీమిండియా మాత్రం మరో 3 రోజులు క్వారంటై