గురువారం రాత్రి ఓ అరుదైన ఘటన ఆకాశంలో కనువిందు చేసింది. అర్థరాత్రి చంద్రుడు తన రంగును మార్చుకున్నాడు. ఏకంగా స్ట్రాబెర్రీ కలర్‌లోకి మారి కనువిందు చేశాడు.
ఈ సంవత్సరంలో చివరి సూపర్‌మూన్ గురువారం రాత్రి కనిపించింది. సంపూర్ణంగా కాంతులు వెదజల్లుతూ ఆకర్షణీయంగా కనిపించింది.
చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా రావడం వల్ల సాధారణం కన్నా పెద్దగా కనిపించడాన్నే సూపర్ మూన్ అంటారు.
ఇక వసంత కాలం చివర్లో, వేసవి కాలం ప్రారంభంలో కనిపించే నిండు పున్నమి జాబిలిని స్ట్రాబెరీ మూన్ అంటారు. ఇది అర్థరాత్రి సమయంలో ఆకాశంలో దర్శనమిచ్చింది.
యూరప్‌లోని నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, రొమేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫ్రాన్స్, జర్మనీ, హంగరీల దేశాల్లో కనిపించింది.
అలాగే ఆసియాలోని రష్యా, భారత్, చైనా, జపాన్, ఉక్రెయిన్ దేశాల్లో అమెరికా ఖండంలోని కెనడా, మెక్సికో, అమెరికా ప్రజలు ఈ స్ట్రాబెరీమూన్ సౌందర్యాన్ని ఆస్వాదించారు.
ఈ దేశాల సంవత్సరంలో సుదీర్ఘ పగటి సమయం జూన్ 21న ఉంటుంది. ఆ రోజే స్ట్రాబెరీమూన్ కనిపిస్తుంది. ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం సోమవారం నుంచి ప్రారంభమైంది.
భారత దేశంలో స్ట్రాబెరీమూన్ గురువారం రాత్రి 12.10 గంటలకు అత్యంత స్పష్టంగా కనిపించింది.
ఆ పేరెలా వచ్చిందంటే..
ప్రాచీన అమెరికన్ తెగలకు చెందిన వారు స్ట్రాబెరీల పంట కోత కాలం ఫుల్ మూన్‌తో ప్రారంభించేవారు. అందుకే దీనికి స్ట్రాబెరీమూన్ అని పిలుచుకుంటారు.
యూరోపులో దీనిని రోజ్ మూన్ అంటారు. అక్కడ గులాబీల సేకరణ కాలం అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఉత్తరార్ధ గోళంలో వేసవి ప్రారంభమవుతుంది కాబట్టి దీనిని హాట్ మూన్ అంటారు.
వేసవి కాలం ప్రవేశంతో స్ట్రాబెరీమూన్ ఒకేసారి రావడం సుమారు ఇరవయ్యేళ్ళకు ఒకసారి మాత్రమే జరుగుతుంది.