టీమిండియా క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత్ రెండు ప్రధాన జట్లతో బరిలోకి డిగానున్న విషయ తెలిసిందే. కోహ్లీ నెటుత్వంలోని ఓ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉంటే.. శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు నేడు శ్రీలంక బయల్దేరింది.
అక్కడ లంక జట్టుతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. మొత్తం 20 మంది సభ్యులు, ఐదుగురు నెట్ బౌలర్లతో కూడిన ఈ జట్టు విమానంలో పర్యాటక దేశానికి బయలుదేరింది.
ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే టీమిండియా ఫొటోను కూడా షేర్ చేసింది.
ఇదిలా ఉంటే శ్రీలంక చేరుకున్న తరువాత భారత జట్టు జూలై 1 వరకు కొలంబోలో క్వారంటైన్‌లో ఉండనుంది. ఆ తర్వాత ప్రకటీస్ మొదలు పెట్టనుంది.
కాగా.. జూలై 13 నుంచి అయిరీఆ ప్రారంభమవుతుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ 13న జరగనుండగా.. మిగతా రెండు మ్యాచ్ లు 16, 18 తేదీల్లో జరగనున్నాయి. ఆ తర్వాత టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.
జూలై 21 తొలి టీ20 జరగనుండగా.. 23, 25 తేదీల్లో మిగతా రెండు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక యువజట్టు కెప్టెన్‌గా ధావన్ వ్యవహరించనుండగా, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా మార్గనిర్దేశనం చేయనున్న సంగతి తెలిసిందే.
శ్రీలంక టూర్‌కు వెళ్లిన భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కే గౌతం, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.
అలాగే నెట్ బౌలర్స్‌గా ఇషాన్ పోరేల్, సందీప్ వారియర్, అర్ష్‌దీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్‌జీత్ సింగ్ ఎంపికయ్యారు. మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి.