అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో రెచ్చిపోయాడు. తొలి టీ20లో డకౌట్ వెనుతిరిగి విమర్శలపాలైనప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అజేయంగా అర్థసెంచరీ చేసి జట్టుకు విజయం సాధించిపెట్టాడు. మొత్తం 49 బంతుల్లోనే 73 పరుగులు బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ హాఫ్ సెంచరీతో టీ20ల్లో కోహ్లీ సాధించిన పరుగుల సంఖ్య 3వేలు దాటింది. ఈ ఫార్మాట్‌లో ఇన్నివేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
కాగా అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగాగానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు కోసం కోహ్లీకి కేవలం 226 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. అలాగే టీ20 క్రికెట్లో అత్యథిక సార్లు 50పైగా స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో రెండో టీ20తో చేసిన హాఫ్ సెంచరీతో కోహ్లీ మొత్తం 26 సార్లు అర్థశతకాలు పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను కూడా వెనక్కి నెట్టి తాజాగా తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనిని ఛేదించే క్రమంలో కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. కానీ మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(56: 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)తో మాత్రం వీర విహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి కెప్టెన్ విరాట్ కోహ్లీ(73: 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కూడా తోడవడంతో స్టేడియంలో బౌండరీల మోత మోగింది. తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ తన స్టైల్ ఆటను ప్రదర్శించాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ విన్నింగ్ షాట్‌ను సిక్స్‌తో ముగించాడు.
ఇక ఓపెనర్ ఇషాన్ అవుటైన తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్(26: 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కూడా క్రీజులో ఉన్నంత సేపు తన బ్యాటు ఝుళిపించాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌లు తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరపున ఓపెనర్ జేసన్ రాయ్(46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్ మలాన్(24), బెయిర్ స్టో(20), ఇయాన్ మోర్గాన్(28), బెన్ స్టోక్స్(24) స్కోర్లు చేశాడు. ఇండియన్ బౌలర్లలో శార్దూల్, సుందర్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.