ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఓపెనింగ్ చేసినా, వన్‌డౌన్‌లో వచ్చినా ఆట తీరులో మార్పు రాదని, అందుకే కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చాడని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఓపెనర్‌గా రావడమే కాకుండా సక్సెస్ కూడా అయ్యాడని, అయితే జట్టు ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాడని రోహిత్ చెప్పాడు. పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. మ్యాచ్ గెలవాలనే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటామని, కోహ్లీ కూడా అదే చేశాడని అన్నాడు. జట్టుకు అవసరమైన దశలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి బ్యాట్స్‌మన్ సిద్ధంగా ఉండాలి. అదే కోహ్లి చేశాడు.. తాను ఓపెనర్‌గా రాణించగలనన్న నమ్మకం కోహ్లికి ఉంది. అదే అతడికున్న అదనపు బలం. జట్టు సారథి ఇలా ఉంటేనే మ్యాచ్‌లు గెలవగలం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఎవరేమనుకున్నా.. ఓపెనింగ్‌లో ఎవరు ఆడాలి..? ఎవరు ఆడకూడదు.. అనే నిర్ణయం పూర్తిగా కెప్టెన్ చేతిలో ఉంటుందని, కోహ్లీ తన నిర్ణయం ప్రకారమే ఓపెనింగ్ చేశానని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్‌గా సక్సెస్ అయ్యాడని, అయితే తొడ కండరాల గాయంతో ఇషాన్ బాధపడుతుండడంతో అతడిని జట్టులోకి తీసుకోలేదని వివరించాడు.
కాగా టీమిండియా దృష్టంతా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌పైనే ఉందని, ఐపీఎల్ ముగిసిన తర్వాత పూర్తిగా దానిపైనే దృష్టి సారించనున్నామని రోహిత్ వెల్లడించాడు. అందుకే అన్ని రకాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని తెలిపాడు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.