Tuesday, March 24, 2026

సూర్యకుమార్‌కు పిచ్చిపట్టిందట.. వీడియో పోస్ట్ చేసిన భార్య

టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ గురించి అతడి భార్య దేవిష శెట్టి ఓ ఫన్నీ విషయాన్ని బయటపెట్టింది. తాజాగా ఓ వీడియో షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. తన భర్త చాలా విచిత్రమైన వ్యక్తని, విచిత్రమైన పనులు చేస్తుంటాడని ఆ వీడియోలో తెలిపింది. ఈ వీడియోలో స్కై, దేవిషా మధ్య జరిగిన సరదా సంభాషణ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో.. జాతీయ జట్టుకు తొలిసారిగా ఆడిన మ్యాచ్‌లో తన మెరుపు ఇన్నింగ్స్‌ చూసుకుని మురిసిపోతున్నాడు. ఇంతలో దేవిష అతడి వద్దకు వచ్చి ‘ఏం చేస్తున్నావు..?’ అని అడిగింది. దానికి స్కై ‘బౌండరీలు, సిక్సర్లు చూసుకుంటున్నా’ అని నవ్వుతూ చెప్పాడు.

ఈ తంతు మొత్తాన్నీ వీడియో తీస్తున్న దేవిష.. ‘నిజంగా ఈ అబ్బాయి చాలా క్రేజీ. మ్యాచ్‌ పూర్తైన ప్రతిసారీ.. టీవీలో లేదా మొబైల్‌లో ఇలా తన ఇన్నింగ్స్‌‌ను మళ్లీ మళ్లీ చూసుకుంటూ ఉంటాడు. మ్యాడ్‌’ అని కామెంట్‌ చేసింది. ఈ వీడియో ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్కై అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇదిలా ఉంటే టీమిండియాలో చోటు కోసం సూర్య ఎంతో కాలం వేచి చూశాడు. ఎట్టకేలకు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 ద్వారా జాతీయ జట్టులోకి వచ్చినా.. బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత మూడో టీ20కి మళ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. మళ్లీ నాలుగో టీ20లో అవకాశం దక్కడంతో.. ఈ సారి స్కై ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచి, 6 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో కేవలం 28 బంతుల్లోనే ఏకంగా 57 పరుగులు చేసి అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఇక శనివారం జరిగిన ఐదో టీ20లో కూడా స్కై తనదైన దూకుడుతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టు గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -