Friday, April 4, 2025

నో బాల్ సైరన్‌ ఇంత ఆలస్యంగానా..? సీఎస్‌కే అసహనం

కోల్‌కతా నైట్‌రైడర్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లూ బౌండరీల మోత మోగించాయి. మైదానంలో పరుగుల వరద పారించాయి. 200కు పైగా పరుగులతో అదరగొట్టాయి. అయితే ఎట్టకేలకు విజయానికి 18 పరుగుల దూరంలో కేకేఆర్ జట్టు ఆగిపోవడంతో సీఎస్‌కే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ నో బాల్ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశమైంది. థర్డ్ అంపైర్ అలా ఎలా నోబాల్ ఇస్తారంటూ సీఎస్‌కే అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఐపీఎల్‌–2019లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ గుర్తుందా! ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు 7 పరుగులు చేయాల్సి ఉండగా, మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే టీవీ రీప్లేలో అది ‘నోబాల్‌’గా తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లి ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నోబాల్‌’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో చెన్నై కెప్టెన్‌ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగాడు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్‌ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 2020 ఐపీఎల్‌లో తొలిసారి ‘నోబాల్‌ అంపైర్‌’ అంటూ ప్రత్యేకంగా నియమించారు. ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్, రిజర్వ్‌ అంపైర్‌లకు ఇది అదనం. కేవలం మ్యాచ్‌లో నోబాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్‌ పని. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నో బాల్‌ అంపైర్‌ అంశం ఇలా ఆలస్యం కావడంతో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇన్నింగ్స్ 11 ఓవర్‌ రవీంద్ర జడేజా వేశాడు. అప్పటివరకు సిక్సర్లతో కదం తొక్కిన రసెల్‌‌ను ఈ ఓవర్లో జడేజా కొద్దిగా కట్టడి చేశాడు. ఓవర్ ముగిసింది. ఆఖరి బంతి కూడా విసిరిన జడేజా.. తన ఫీల్డింగ్ ఫీల్డింగ్‌ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. కీపర్‌ ధోని కూడా బ్యాట్స్‌మన్‌ ఎండ్‌ మారిపోయాడు. మరో బౌలర్‌ కూడా బౌలింగ్ పొజిషన్‌లోకి వచ్చేశాడు. ఇంతలో నో బాల్‌ సైరన్‌ మోగింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఇంత ఆలస్యంగా నోబాల్‌ సైరన్‌ ఏమిటంటూ సీఎస్‌కే సభ్యులు కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. మళ్లీ స్టైకింగ్‌ ఎండ్‌ మారి, ఫీల్డింగ్ పొజిషన్స్ ఛేంజ్ చేసుకుని ఆ ఖరి బంతి విసిరాడు జడేజా. ఫ్రీ హిట్‌ కావడంతో దాన్ని కూడా రసెల్‌ సిక్స్‌గా బాదాడు.

సాధారణంగా ఓవర్‌ చివరి బంతి నో బాల్‌ అయితే ఒక బౌలర్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌కు వెళ్లకముందే నో బాల్‌ సిగ్నల్‌ రావాలి. కానీ చాలా ఆలస్యమైంది. నో బాల్‌ అంపైర్‌ చూడటానికి, అది కన్ఫామ్‌ చేసుకోవడానికి టైమ్‌ పట్టి ఉండొచ్చు. కానీ ఇలా మొత్తం ఛేంజ్‌ అయిన తర్వాత నో బాల్‌ సైరన్‌ మోగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గతంలో బౌలర్‌ వేసే లైన్‌ క్రాస్‌ నో బాల్‌ ఫీల్డ్‌ అంపైర్ల చేతిలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ బాధ్యత థర్డ్‌ అంపైర్‌కు అప్పగించడంతో ఆలస్యం అవుతోంది. ఈ సీజన్ ఐపీఎల్‌లో తరచుగా ఇలా జరుగుతోంది. దీంతో ఇప్పుడు మళ్లీ నోబాల్‌ను ఫీల్డ్ అంపైర్‌కే అప్పగించేస్తారా..? అనే అనుమానాలు కూడా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x