Friday, November 1, 2024

‘90 నిముషాల్లో ఫ్లైట్ వెళ్లాలి, లేకపోతే కోహ్లీకి ఫైన్’ ఆ మాట అన్న వ్యక్తిని ఆర్సీబీ ఏం చేసిందంటే..

ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో ఆర్సీబీ మూడు మ్యాచ్‌లో ఆడి మూడింటిలోనూ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కూడా టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు చెన్నైలో మ్యాచ్‌లు ముగించుకున్న బెంగళూరు.. ముంబై ప్రయాణమైంది. దీనికోసం ఆర్సీబీ జట్టు సభ్యులు, టీం మేనేజ్‌మెంట్ సభ్యులంతా కలిసి ప్రత్యేక విమానంలో ముంబైకి బయల్దేరారు. వారితో పాటు కమెడియన్‌ ‘మిస్ట‌ర్ నాగ్స్‌(డానిష్‌ సైత్‌)’ కూడా ఉన్నాడు. ఫ్లైట్‌లో ఆటగాళ్లకు వినోదం పంచేందుకు హెస్ట్‌ ప్రజెంటర్‌గా నాగ్స్ వ్యవహరించాడు.

ఆటగాళ్లపై పంచ్‌లు వేస్తూ.. వారితో సరదా పనులు చేయిస్తూ నవ్వులు పూయించాడు. అందులో భాగంగానే కెప్టెన్ కోహ్లిపై కూడా నాగ్స్ పంచ్‌లు విసిరాడు. కోహ్లికి మ్యాచ్‌ల్లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసి జరిమానాల బారిన పడటం సర్వసాధారణమేనని, అయితే ఈ సారి ఫ్లైట్‌ లేటయినా అతడిపై ఫైన్ పడుతుందంటూ పంచ్‌లు విసిరాడు. ‘విమానం 90 నిమిషాల్లో ముంబైకి వెళ్లాలి. లేకపోతే కోహ్లికి ఫైన్‌ వేద్దాం’ అంటూ సెటైర్‌ వేశాడు. అంతేకాదు ఐపీఎల్‌లో ఎప్పుడూ బెంగ‌ళూరు ఇలా టాప్‌లో లేదు. ఇక చాలు. దీనిని ఇలా ముగించేద్దాం. ముంబైకి వ‌ద్దు. బెంగ‌ళూరుకు వెళ్లిపోదాం. ఇక టోర్నీలో ఆడొద్దు అంటూ కోచ్‌, కెప్టెన్ స‌హా టీమ్‌లోని ప్ర‌తి ప్లేయ‌ర్ ద‌గ్గ‌రికీ వెళ్లి బతిమాలాడు. దీంతో అంతా నవ్వుకున్నారు.


అలాగే ముంబై పిచ్‌పై కేవలం ఏబీ డివిలియర్స్‌పైనే ఆధారపడవద్దని, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, షెహబాజ్‌ అహ్మద్‌ కూడా జట్టులో ఉణ్నారని, బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ కూడా అండగా ఉంటాడని సెటైర్లు వేశాడు. దీంతో అతడి గోల తట్టకోలేక జట్టు సభ్యులంతా కలిసి అతడిని ఫ్లైట్‌లోని బాత్‌రూమ్‌లోకి నెట్టి బయట తాళం వేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ ఫ్రాంచైజీ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ వీడియోనే విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. తమ జట్టు చెన్నైలో జోరు ముంబైలో కూడా చూపించాలని కోరుకుంటున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x