ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డునందుకున్నాడు. ఐపీఎల్‌లో 6000వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అది కూడా కేవలం 196 మ్యాచ్‌లలోనే కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. కాగా.. విరాట్ కోహ్లీ తరువాత సురేశ్ రైనా 197 ఇన్నింగ్స్‌లో 5,448 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత మూడో స్థానంలో శిఖర్ ధవన్ 180 మ్యాచ్‌లలో 5,428 రన్స్ చేశాడు. ఆ తరువాత నాలుగో స్థానంలో డేవిడ్ వార్నర్ 146 ఇన్నింగ్స్‌లో 5,384, ఐదో స్థానంలో రోహిత్ శర్మ 204 ఇన్నింగ్స్‌లో 5,368 పరుగులతో నిలిచాడు. ఏబీ డివలియర్స్(173-4,974) ఆరో స్థానంలో, క్రిస్ గేల్(136-4,848) ఏడో స్థానంలో, ఎంఎస్ ధోనీ(208-4,667) ఎనిమిదో స్థానంలో, రాబిన్ ఊతప్ప(189-4,607) తొమ్మిదో స్థానంలో, గౌతం గంభీర్(154-4,217) పదో స్థానంలో ఉన్నారు.
కాగా.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ అదిరిపోయే విజయం సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్(101: 52 బంతుల్లో.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(72: 47బంతుల్లో.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. దీంతో ఇప్పటివరకు ఈ సీజన్లో తొలిసారిగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. అలాగే మరో 21 బంతులు మిగిలుండగానే.. లక్ష్యాన్ని ఛేదించింది. 16.3 ఓవర్లలో 181 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో ఒక్కరు కూడా కనీసం ఓ వికెట్ కూడా తీయలేకపోవడం గమనార్హం.