Wednesday, January 22, 2025

రెండో వన్డే కొట్టేసిన ఇంగ్లండ్

టీమిండియాపై ఇంగ్లండ్ చారిత్రక విజయం సాధించింది. వన్డే చరిత్రలో ఇండియాపై ఎన్నడూ ఛేదించని స్కోరును తొలిసారిగా ఛేదించి చరిత్ర సృష్టించింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 6 వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వన్డేను మించి ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విజృంభించారు. తొలి వన్డేలో అజేయ అర్థ సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్ రెండో వన్డేలో ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేశాడు. టీ20 సిరీస్‌లో విఫలమైనా వన్డేల్లో జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మొదటి నుంచి క్లాసికల్ షాట్స్ ఆడుతూ చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ పరుగులు రాబట్టాడు.

కోహ్లీ, పంత్ అండగా సెంచరీతో అదరగొట్టాడు. కాగా.. 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టాప్ కర్రాన్ వేసిన ఓ బౌన్సర్‌ను థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడబోయి టాప్‌లీకి చిక్కాడు. ఆ తర్వాత పంత్ కూడా భారీ షాట్ ఆడబోయి 77 పరుగుల వద్ద అవుటైపోయాడు. కాగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(66) కూడా అర్థ సెంచరీతో మెరిశాడు. కానీ తొలి వన్డేతో 98 పరుగులతో టీప్ స్కోరర్‌గా నిలిచిన ధవన్ ఈ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్(20) మళ్లీ నిరాశపరిచాడు. చివర్లో హార్దిక్ పాండ్యా(35) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఇంగ్లీష్ బౌలర్లలో రీసీ టాప్లీ, టామ్ కర్రాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. శామ్ కర్రాన్, ఆదిల్ రషిద్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. 336 పరుగుల భారీ స్కోరు కొట్టినా.. భారత్‌కు ఓటమి తప్పలేదు. గెలుపు కోసం పట్టుదలగా ఆడిన ఇంగ్లండ్ ఇండియాపై వన్డే చరిత్రలోనే అతి గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లలో జానీ బెయిర్‌స్టో(124: 112 బంతుల్లో, 11 ఫోర్లు, 7 సిక్సులు) సెంచరీతో అదరగొట్టగా.. బెన్ స్టోక్స్(99: 52 బంతుల్లో, 4 ఫోర్లు, 10 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. ఇక ఓపెనర్ జేసన్ రాయ్(55: 52 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో రాణించాడు. అయితే టీమిండియా ఓటమికి ముఖ్యంగా బౌలర్ల పేలవ ప్రదర్శనే కారణంగా కనిపిస్తోంది.

బౌలింగ్ తేలిపోవడంతో..
మొదటి వన్డేలో చక్కగా బౌలింగ్ చేసిన భారత బౌలర్ల రెండో వన్డేలో తేలిపోయారు. ప్రధానంగా ఈ సిరీస్‌తోనే అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ తొలి వన్డేలో నాలుగు వికెట్లతో రాణించినా.. ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. 2 వికెట్లు తీసినా అవసరమైనప్పుడు పరుగులు రాకుండా నిలువరించలేకపోయాడు. అలాగే తొలి మ్యాచ్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కూడా ఓ వికెట్ మాత్రమే తీసి 6కు పైగా ఎకానమీతో పరుగులిచ్చాడు. ఇక శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు పిండుకున్నారు. వీరందరికంటే ఎక్కువగా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ బౌండరీల వర్షం కురిపించారు. మొత్తం ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లు వేసిన కృనాల్ ఏకంగా 72 పరుగులు ఇచ్చి ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే ఈ విజయంతో వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. నిర్ణాయక మూడో వన్డే మార్చి 28న జరగనుంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x