Sunday, March 22, 2026

ఎయిర్‌పోర్టులో భార్య, కూతురితో కోహ్లీ.. అసహనంలో ఫాన్స్

ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకుంది. అదే ఉత్సాహంలో ఆదివారం పుణే బయలుదేరింది. మంగళవారం నుంచి అక్కడ జరగబోయే వన్డే సిరీస్ కోసం సన్నద్ధమయ్యేందుకు ముందుగానే ప్రయాణమైంది. అంతా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే ఈ ప్రయాణంలో కొందరు క్రికెటర్లతో పాటు వారి భాగస్వాములు కూడా ఉన్నారు. పాండ్యా-నటాషా దంపతులు తమ కుమార్తె అగస్త్యతో, విరాట్ కోహ్లీ-అనుష్కలు కూతురు వామికతో బయలుదేరారు. ఇక్కడే కోహ్లీ, అనుష్కలు చేసిన పని అభిమానులకు నచ్చడం లేదు.

అహ్మాదాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లను మీడియా దూరం నుంచి ఫోటోలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పాపను ఎత్తుకుని వెళుతున్న అనుష్క.. పాప ముఖం కనపడకుండా దాచేసింది. వెనక కోహ్లీ లగేజ్ తీసుకుని వస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో కోహ్లీపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ‘ఇదేం బాలేదు కోహ్లీ భయ్యా.. ఇంకెన్నాళ్లు వామిక ముఖం కనపడకుండా దాచి పెడతావ్‌.. మాకు కూడా చూపించు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే మంగళవారం నుంచి పుణేలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం టీమిండియా మంగళవారం ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌, విరాట్ కోహ్లీ తదిరత ఆటగాళ్లంతా మైదానంలో చెమటోడ్చారు. జట్టులోకి కొత్తగా వచ్చిన కృనాల్ పాండ్యా, ప్రసీద్ కృష్ణలు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను ఐసీసీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -