సోషల్ మీడియాలో ప్రస్తుతం రెండు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసినది కాగా.. మరొకటి అతడి ట్వీట్‌పై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలెంగ్జాండ్రా చేసిన ట్వీట్. తాజాగా సౌత్ ఆఫ్రికా, ఇండియా మహిళా జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహిళలపై సౌత్‌ఆఫ్రికా మహిళల జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. కాగా.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అశ్విన్ ఓ ట్వీట్ చేశాడు. `లౌరాను ఎలా అవుట్ చేయాలి? అమెకు సాఫ్ట్ సిగ్నల్ పంపించాలా?` అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అలాగే లౌరా అద్భుతంగా ఆడుతోందని, ఆమె ఆటతీరు తనకెంతో నచ్చిందని ప్రశంసించాడు.
మహిళల క్రికెట్‌పై అశ్విన్ చూపిన ఆసక్తికి ఇంగ్లండ్ ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు అలెగ్జాండ్రా హార్ట్‌లే తెగ ఆనందపడిపోయింది. వెంటనే అశ్విన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. `ఇదే మేం కోరుకునేది. అన్నింటికంటే ఇదే ముఖ్యమైనది కూడా. మహిళల ఆటపై నిజమైన ఆసక్తి కనబర్చిన అశ్విన్‌కు ధన్యవాదాలు` అని అలెంగ్జాండ్రా తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. కాగా.. టీమిండియా, సౌత్‌ఆఫ్రికా మహిళల మధ్య ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు ధాటిగా ఆడి మ్యాచ్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సౌత్‌ఆఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ ఉమన్ లౌరా వోల్వార్ట్ 39 బంతుల్లోనే 53 పరుగులు చేసి అజేయంగా జట్టును గెలిపించుకుంది. దీంతో ఆమెపై అనేకమంది మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే అశ్విన్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లోనూ సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌తో ఏకంగా 352 వికెట్లు తీసి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానానికి చేరి హర్బజన్ స్థానాన్ని ఆక్రమించాడు. అంతకుముందు ఆసీస్ టూర్‌లోనూ సత్తాచాటాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సూపర్ ఫాం కనబరిచాడు.