Thursday, November 21, 2024

స్కై ఇలానే ఆడితే నేను ఓపెనింగ్‌పై ఆలోచిస్తా: కోహ్లీ

ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి విధ్వంసం సృష్టించారో వేరే చెప్పక్కర్లేదు. సాధారణంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే కోహ్లీ తొలిసారి ఓపెనింగ్ చేసి అద్భుతమైన ఫలితం రాబట్టాడు. దీంతో రాబోయే మ్యాచ్‌లలో కూడా కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జట్టులో ఓపెనింగ్ చేయడానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు 5వ టీ20లో ఓపెనింగ్ చేయడానికి గల సీక్సెట్‌ను కూడా బయటపెట్టేశాడు.

‘మైదానంలో దిగే జట్టు కూర్పులో సెలక్టర్లకు ఎలాంటి పాత్ర లేదు. ఇక రోహిత్‌ చెప్పినట్టుగా ఇదొక వ్యూహం మాత్రమే. నిజమే, మేమిద్దరం కలిసి ఓపెనింగ్‌ చేయడాన్ని ఆస్వాదించాం. మా బ్యాటింగ్‌ జట్టుపై సానుకూల ప్రభావం చూపడంతో పాటు మంచి బలాన్నిచ్చింది. అయితే భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందన్న గ్యారంటీ నేనివ్వలేను. గతంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాను. మూడో స్థానంలో దిగాను. ఒకప్పుడు టీ20 క్రికెట్లో ఓపెనింగ్‌ చేశాను. అయితే ఓపెనర్‌గా నా పాత్రను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా. అలా చేయడం వల్ల సూర్యకు సరైన స్థానం లభిస్తుంది. సూర్య ఇదే ఫాం కొనసాగిస్తే.. జట్టు అవసరాల కోసం నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటినుంచే దృష్టి సారించాం. అప్పటికల్లా ఓ నిర్ణయానికి వచ్చేస్తామని అనుకుంటున్నా’ అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై టెస్ట్, టీ20 సీరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం పూణే చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. సీనియర్ ఆటగాళ్లతో పాటు జట్టులోకి కొత్తగా వచ్చిన కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కాగా ఇంగ్లండ్ మాత్రం కచ్చితంగా స్వదేశానికి వట్టి చేతులతో వెళ్లకూడదని అనుకుంటోంది. ఇప్పటికే వరుస సిరీస్ ఓటములతో కుదేలైన ఇంగ్లీష్ జట్టు వన్డే సిరీస్‌ అయినా దక్కించుకుని పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x