ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అయ్యో పాపం బౌల్ట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కృనాల్ పాండ్యా వేసిన ఓ ఓవర్‌లో రైజర్స్ కెప్టెన్ వార్నర్ లాంగాన్ మీదుగా బౌండరీ బాదాడు. అది కవర్స్ మీదుగా ఫోర్ బౌండరీకి దూసుకెళ్లింది. అయితే బంతిని ఆపేందుకు ట్రెంట్ బౌల్ట్ దాని వెనుకే పరిగెత్తాడు. అయితే ఆఖరికి బంతికి పట్టుకోలేకపోయాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఫోర్ దక్కింది. అయితే బంతిని ఆపేందుకు బౌల్ట్ అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పరిగెత్తుతున్న సమయంలో బ్యాలన్స్ కోల్పోయాడు. ముందుకు తూలుతూ.. చేతులు ఆడిస్తూ.. నాలుగడుగులు వేసిన తరువాత తూలి బోర్లా పడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విపరీతంగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లు, సెటైర్లతో రెచ్చిపోతున్నారు.
కాగా.. ఇటీవల బౌల్ట్ చెన్నై బీచ్‌లో సర్ఫింగ్ చేశాడు. ఆ విషయాన్ని కూడా నెటిజన్లు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. సర్ఫింగ్ చేస్తున్నప్పటి విన్యాసాలు బౌల్ట్‌కు గుర్తుకొచ్చాయని, అందుకే మైదానంలో కూడా ఈత కొట్టడానికి ప్రయత్నించాడని సెటైర్లు పేలుస్తున్నారు. ఇక న్యూజిలాండ్‌కే చెందిన జిమ్మీ నీషమ్ బౌల్ట్ వీడియోపై చమత్కరించాడు. బౌల్ట్ ఇలా ఫీల్డింగ్‌లో విఫలవడంపై తనకు ప్రతీ ఒక్కరూ ఓ బెస్ట్ గిఫ్ ఫోటోలను షేర్ చేయాలని కోరాడు. దీంతో ప్రస్తుతం నెటిజన్లు ఆ పనిలో ఉన్నారు. నిజంగా పాపం బౌల్ట్. అయితే అంత తూలి పడినా చివర్లో బ్యాలెన్స్ నిలుపుకోవడంతో గాయాల పాలు కాకుండా తనను తాను కాపాడుకున్నాడు.