ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే శ్రేయస్ అయ్యర్ కారణంగా మొత్తం టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు కెప్టెన్ కోసం ఆ ఫ్రాంచైజీ వెదుకుతోంది. అయితే వారికి కొత్త కెప్టెన్ దొరికినట్లే తెలుస్తోంది. జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం ప్రత్యేకంగా వెల్లడించింది. పంత్ టీమిండియా తరపున అధ్భుతంగా ఆడుతున్నాడని, అతడిలో కెప్టెన్సీ చేయగల సత్తా ఉందని ఢిల్లీ ఫ్రాంచైజీ పేర్కొంది. అతడు జట్టును నడిపించగలడని నమ్ముతున్నామని చెప్పుకొచ్చింది.
కాగా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అతడికి ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. బంతిని ఆపేందుకు డైవ్ చేయడంతో అతడి భుజం గట్టిగా నేలను తాకింది. దీని కారణంగా మైదానంలోనే విలవిల్లాడిపోయిన అయ్యర్.. వెంటనే మైదానాన్ని వీడాడు. అనంతరం మెడికల్ సిబ్బంది అతడికి అనేక టెస్టులు నిర్వహించి గాయం చాలా తీవ్రమైందని వెల్లడించారు. ఈ గాయం కారణంగానే అతడు ఆ మ్యాచ్‌లో మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అలాగే ఆ తర్వాతి రెండు వన్డేల నుంచి కూడా తప్పుకున్నాడు. ఐపీఎల్ 2021 నుంచి నుంచి కూడా పూర్తిగా తప్పుకున్నాడు. దానితోప పాటు ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనకు, సెప్టెంబర్‌లో స్వదేశంలో జరగనున్న న్యూజిలాండ్, సౌత్ఆఫ్రికా టీ20 సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు.
ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియన్ లీగ్ 2021 వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ మొత్తం బయోబబుల్ వాతావరణంలో జరగనుంది. అలాగే తటస్థ వేదికల్లో జట్లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. అలాగే స్టేడియంలలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరగనున్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి వాతావరణంలోనే ఐపీఎల్ జరిగినా అది వేరే దేశంలో కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ సారి స్వదేశంలో టోర్నీ జరుగుతున్నా ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడం అభిమానులకు కొంత బాధ కలిగిస్తోంది.