ఆర్సీబీకి ఒకప్పుడు కీలక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. కానీ అతడు బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తుది జట్టులో స్థానం కోల్పోవడమే కాకుండా.. ఏకంగా ఫ్రాంచైజీ అతడిని వదిలేసుకుంది. ఇక గేల్ తరువాత డివిలియర్స్, కోహ్లీ ఆర్సీబీకి కీలక బ్యాట్స్‌మెన్లు. డివిలియర్స్ ఒకప్పుడు వికెట్ కీపర్ బాధ్యతలు కూడా నిర్వర్తించేవాడు. అయితే గతేడాది ఆసీస్ కీపర్ జోష్ ఫిలిప్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో డివిలియర్స్ కేవం బ్యాట్స్‌మెన్‌గానే ఉండిపోయాడు. ఇప్పుడదే అతడికి కొత్త సమస్య తెచ్చిపెడుతోంది.
ఐపీఎల్ 2020లో ఆర్సీబీ తరపున ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. డివిలియర్స్ ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఇప్పుడు ఫిలిప్ అందుబాటులో ఉండడని తెలుసుకున్న ఆర్సీబీ వేలంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఫిన్ ఆలిన్‌ను టీంలోకి తీసుకుంది. 20 లక్షలతో ఫిన్ ఆలిన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది. కొన్ని అనివార్య కారణాలు కారణంగా ఫిలిప్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడని, అతడి స్థానంలో ఫిన్ అలిన్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడని పేర్కొంది. ఇక ఐపీఎల్ 2020లోనే ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన ఫిలిప్.. ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు. మొత్తం 5 మ్యాచ్‌లలో 78 పరుగులు చేశాడు. అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయలేకపోయాడు.
ఇక ఫిన్ అలిన్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఫిన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఎన్నో రికార్డులు సాధించాడు. కెరీర్‌లో మొత్తం 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఫిన్ 48.81 స్ట్రైక్ రేట్‌తో 537 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ టోర్నీలో వెలింగ్టన్ జట్టుకు ఓపెనర్‌గా ఆడుతున్న ఫిన్ నిలకడైన ఆటతో ఆర్జీబీ ఫ్రాంచైజీని ఆకర్షించాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్‌లో కూడా ఇప్పటివరకు 6 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో 512 పరుగులు చేశాడు. ఓపెనర్ అయిన ఫిన్ బౌలర్లపై ఎదురు దాడి చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. కోహ్లీ కూడా ఫిన్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో డివిలియర్స్ బ్యాటింగ్ ప్రదర్శనతో అంచనాలు అందుకోలేకపోతే అతడిని కూడా జట్టులో నుంచి తీసేసేందుకు బెంగళూరు ఆలోచిస్తుందా..? కోహ్లీ దీనికి ఒప్పుకుంటాడా..? అంటే ఏమో వేచి చూడాలి.