Wednesday, January 22, 2025

ఈ సారి ఇంగ్లీష్ జట్టుపైనే పీటర్సన్ టార్గెట్

ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ జరిగినంతకాలం ఇండియాపై నోరు పారేసుకున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. ఆ సిరీస్ తరువాత సైలెంట్ అయిపోయాడు. ఇంగ్లండ్ సిరీస్ కోల్పోవడం, అందులోనూ చివరి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం కెవిన్ నోటికి తాళం పడినట్లైంది. అయితే బుధవారం కెవిన్ మళ్లీ నోరు విప్పాడు. ఇండియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తరువాత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ సారి ఇండియాను కాకుండా ఇంగ్లండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీని టార్గెట్ చేశాడు.

మంగళవారం ఇంగ్లండ్‌ లెజెండ్స్‌, ఇండియా లెజెండ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పీటర్సన్‌ మెరుపులతో ఇంగ్లండ్‌ లెజెండ్స్ గెలిచింది. పీటర్సన్‌ విజృంభించి 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అయితే పఠాన్ బ్రదర్స్ ఆదుకోవడంతో చివరి వరకు పోరాడింది. కానీ చివర్లో 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలిచిన తరువాత తమ ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ జట్టు ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పీటర్సన్.. ఈసీబీని ట్యాగ్‌ చేశాడు. ”ఎట్టకేలకు ఇంగ్లండ్‌ జ్టటు భారత్‌ను తన సొంతగడ్డపై ఓడించింది. ఇక మ్యాచ్ ఎంత కూల్‌గా సాగిందో ఇంగ్లండ్‌ సెలెక్టర్స్‌ చెప్పాలి. ఇంకా మేము బరిలోనే ఉన్నాం” అని ఆ ఫోటోకు క్యాప్షన్‌ పెట్టాడు.

భారత్‌ను సొంతగడ్డపై ఓడించడంలో ఇంగ్లండ్ ప్రస్తుత జట్టుకు సాధ్యం కాలేదని, కానీ తమ సీనియర్ల జట్టు అది సాధ్యం చేసి చూపించిందని పీటర్సన్‌ వ్యంగ్యంగా ఈసీబీని ట్రోల్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్‌ చిత్తుగా ఓడింది. తొలి టెస్టులో గెలిచినా తదుపరి మూడు టెస్టుల్లో వరుస ఓటములు చవి చూసి సిరీస్ కోల్పోయింది.

ఇదిలా ఉంటే అయితే శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం మొదలు కానుంది. ఈ మ్యచ్ కోసం ఇరు జట్లూ పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x