ముంబై: ప్రతి ఏడాది ఐపీఎల్ ద్వారా ఎందరో గొప్ప ఆటగాళ్లు పరిచయం అవుతున్నారు. అలా వచ్చిన వాళ్లలో టీ నటరాజన్ ఒకడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో ఆడిన 16 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగైట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దాంతో ఆస్ట్రేలియా టూర్ కు వెళుతున్న భారత జట్టులే స్థానం దక్కించుకున్నాడు. నటరాజన్ కంగారూలను కూడా తన బౌలింగ్‌తో కంగారు పెట్టాడు. అయితే మళ్లీ ఐపీఎల్‌కు సిద్దమవుతున్న నటరాజన్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి అనేక విషయాలు చెప్పాడు.
”ధోనీ భయ్యా నాకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పించారు. గతేడాది సీజన్‌లో ధోని భయ్యా ఎన్నో విలువైన సలహాలు అందించాడు. ఫిట్‌నెస్ కాపాడుకోవడం కోసం కావాల్సిన పలు కీలక అంశాలు చెప్పారు. అంతేకాకుండా బౌలింగ్‌లో స్లో బౌన్సర్స్, కట్టర్స్‌లో ఉండే వివిధ అంశాల గురించి చర్చించాడు. అనుభవం వచ్చే కొద్ది మరింత రాటుదేలుతావు అన్నాడు. అయితే ఒక మ్యాచ్‌లో నేను వేసిన బంతిని ధోని భయ్యా లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికే ధోని భయ్యా వికెట్ పడగొట్టినా సెలబ్రేషన్ చేసుకోలేదు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనిని కలిసాను. అనేక అంశాలపై చాలాసేపు మాట్లాడుకున్నము. అప్పుడు ఎన్నో విలువైన సలహాలు అందించాడు. వాటన్నింటినీ ఈ సీజన్‌లో వాడేందుకు సిద్ధమవుతున్నా.
ఇక మా జట్టు కెప్టెన్ వార్నర్ విషయానికొస్తే.. సహచరులను ప్రోత్సాహిఓచడంలో ముందుంటాడు. అతడు ప్రోత్సహించే తీరు మరువలేననిది. వార్నర్ నన్ను ప్రేమగా నట్టూ అని పిలుస్తాడు. అతని ప్రోత్సాహంతోనే గతేడాది సీజన్‌లో అద్భుతంగా రాణించాను. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రాణించేఓదుకు చూస్తున్నాను. నాపై పెట్టుకున్న అంచనాలను అందుకునేఓదుకు కృషి చేస్తాన”ని అన్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరగనున్న తన తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది.