చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి బంతికి మ్యాచ్‌లో విజయం సాధించి పాయిట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరింది. 10 ఓవర్ల వరకు పటిష్ఠ స్థితిలో ఉన్న సన్‌రైజర్స్.. ఆ తర్వాత లయ కోల్పోయింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్(54: 37 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయిన తర్వాత రైజర్స్ కకావికలమైపోయింది. కనీస పోరాటం కూడా చూపలేక చతికిలపడింది. ఈ క్రమంలోనే 17వ ఓవర్ వేసిన షెమబాజ్ అహ్మద్.. అద్భుత ఓవర్‌తో 3 వికెట్లు తీసి సన్‌రైజర్స్ వెన్ను విరిచాడు. దీంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. ఇక ఆ తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన రైజర్స్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడమే కాకుండా కనీస పరుగులు చేయలేకపోయారు. దీంతో చివరి ఓవర్లో 16 పరుగుల చేయాల్సిన స్థితికి సన్‌రైజర్స్ చేరింది. అయితే హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 143 పరుగులు మాత్రమే చేసి 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇక ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరింది. ఆడిన 2 మ్యాచ్‌లలో 2 గెలిచి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో షహబాజ్ నదీమ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు, కైల్ జేమీసన్‌కు 1 వికెట్ దక్కింది. ఈ మ్యచ్‌లో ఆర్సీబీ విజయంతో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించినట్లైంది. మ్యాచ్ చివరి వరకు గెలుపు ఇద్దరు దోబూచులాడింది. దీంతో చివరి బంతి వరకు విజేత ఎవరో తేలలేదు. అయితే చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్‌ను మలుపుతిప్తేయడంతో గెలుపు ఆర్సీబీ సొంతమైంది.
కాగా.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్‌లోనే ఇప్పటివరకు అతి తక్కువ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు నమోదు చేసింది. తొలుత ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(11: 13 బంతుల్లో.. 2 ఫోర్లు), వన్‌డౌన్‌లో వచ్చిన షాహబాజ్ అహ్మద్(14: 10 బంతుల్లో.. ఒక సిక్స్) తక్కువ పరుగులకే అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో.. 4 ఫోర్లు)పై ఒత్తిడి పెరిగింది. దీంతో అతడు ఆచి తూచి ఆడాడు. అయితే 13వ ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ.. స్క్వేర్ లెగ్‌లో శంకర్ సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఇక ముంబైతో అద్భుతంగా ఆడిన ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగుకే అవుట్ కావడంతో ఆర్సీబీ డగౌట్ షాక్‌లో ఉండిపోయింది. అయితే వీరిద్దరూ అవుటైనా భారమంతా తనపై వేసుకను్న గ్లెన్ మ్యాక్స్‌వెల్(59: 41 బంతుల్లో.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లు).. అర్థసెంచరీతో రాణించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించడంలో సఫలమయ్యాడు.