వరుస విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో టోర్నీ హాట్ ఫేవరెట్ సన్‌రైజర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. కాగా.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ నైట్ పార్టీ చేసుకుంది. సప్పర్ థియేటర్ గేమ్ పేరుతో ఆటగాళ్లంతా తమలోని నటనా నైపుణ్యాన్ని బయటపెట్టారు. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్, స్పిన్నర్ యుజ్వేద్ర చాహల్ తెగ ఎంజాయ్ చేశారు.
ఆర్సీబీ ఆటగాళ్లంగా మూడు జట్లుగా విడిపోయారు. అందులో ఓ జట్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహించగా.. మరో జట్టుకు డివిలియర్స్, ఇంకో జట్టుకు యజ్వేంద్ర చహల్ కెప్టెన్నీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరి నాయకత్వంలోనే మిగతా ఆటగాళ్లంతా తెగ ఎంజాయ్ చేశారు. తొలుత కోహ్లీ.. అగ్లీ డక్లింగ్‌తో చిన్నపిల్లాడిలా మారిపోయి తన యాక్టింగ్‌తో అలరించాడు. ఆ తర్వాత డివిలియర్స్ సిండ్రిల్లా గేమ్ ఆడాడు. ఇక చాహల్.. కోహ్లీ, డివిలియర్స్‌ను అనుసరించి అందరినీ నవ్వించాడు. కాగా ఆర్‌సీబీ ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, జట్టు యాజమాన్యం కూడా ఈ సరదా సాయంత్రంలో పాలుపంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో భాగంగా ట్విటర్లో పోస్ట్ చేసింది.
‘ఇది కేవలం ఫన్ కోసం మాత్రం కాదు. దాదాపు 50 రోజులకు పైగా జట్టుగా కలిసి క్రికెట్ ఆడాల్సి ఉండడం వల్ల ఆటగాళ్లలో మానసిక ఒత్తిడి దూరం చేసేందుకు ఇలా చిన్ననాటి ఆటలను మరోసారి ఆడించాం. వాళ్లు ఎంత సరదాగా ఆడారో.. అంత ఎంటర్‌టైన్మెంట్ అందించారు.’ అంటూ ఆ వీడియోకు ఆర్సీబీ క్యాప్షన్ జోడించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bold Diaries: Supper Theatre
Team Bonding done right! We got our cricketers to perform famous plays from their childhood days. They were absolutely brilliant and hilarious too. 😁🤩
Watch it on @myntra presents Bold Diaries#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/UBqdBGLoBV
— Royal Challengers Bangalore (@RCBTweets) April 17, 2021
ఇదిలా ఉంటే ఆర్సీబీ ఆదివారం కేకేఆర్‌తో మూడో మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ముంబైతో మ్యాచ్‌లలో ఓడిన కేకేఆర్.. ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే ఆర్సీబీ మాత్రం ఎలాగైనా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టేబుల్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉంది. మరి ఆర్సీబీ ఆశ నెరవేరుతుందా..? లేక ముంబై చేతిలో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదిస్తుందా..? అనేది తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.