Wednesday, January 22, 2025

ఐపీఎల్‌లో తొలి ‘సూపర్’ విక్టరీ.. రైజర్స్‌పై ఢిల్లీ విన్

ఐపీఎల్‌లో మ్యాచ్‌లు గడిచే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రతి మ్యాచ్ ఓ మినీ సైజు యుద్ధాన్ని తలపిస్తోంది. ఏ జట్టూ తీసిపక్కన పెట్టడానికి వీల్లేకుండా ప్రదర్శన చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌-సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లలో విజేత ఎవరో మ్యాచ్ చివరకు కూడా తెలియలేదు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ 20 ఓవర్లలో 159 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. దీంతో ఈ సీజన్లో తొలిసారిగా సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ చివరి బంతికి ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్ 6 బంతుల్లో.. 7 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 8 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. ఓవర్లో 8 పరుగులు పూర్తి చేసి విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పృధ్వీ షాకు దక్కింది.

రైజర్స్ ఇన్నింగ్స్:
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ప్రారంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్(6) వెంటనే అవుట్ కావడంతో రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో(38: 18 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి స్కోరు బోర్డును నడిపించాడు. అతడికి కేన్ విలియమ్సన్(66 నాటౌట్: 51 బంతుల్లో.. 8 ఫోర్లు) చక్కగా సహకరించాడు. అయితే పవర్ ప్లే ఆఖరి ఓవర్లో ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో బారీ షాట్ ఆడబోయిన బెయిర్ స్టో షార్ట్ లాంగాఫ్ ఫీల్డింగ్ చేస్తున్న ధవన్‌కు నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా కనీస పరుగులు చేయకపోవడంతో భారం మొత్తం విలియమ్సన్‌పైనే పడింది. కానీ మిగతా బ్యాట్స్‌మన్ అంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో రైజర్స్ ఓటమివైపు పయనించింది. విలియమ్సన్ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. చివర్లో జగదీశన్ సుచిత్(15: 6 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా కూడా 1 వికెట్ దక్కించుకున్నాడు.

ఢిల్లీ ఇన్నింగ్స్:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో అద్భుతంగా ఆడింది. 10 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 80 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. ఓపెనర్ పృధ్వీ షా(53: 39 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధవన్(28: 26 బంతుల్లో.. 3 ఫోర్లు) రాణించారు. అయితే ఆ తర్వాత వరుస ఓవర్లలో శిఖర్ ధవన్, పృధ్వీ షా అవుట్ కావడంతో ఢిల్లీ స్కోరు వేగం తగ్గింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్(28: 26 బంతుల్లో.. 3 ఫోర్లు), స్టీవ్ స్మిత్(34 నాటౌట్: 25 బంతుల్లో.. 3 ఫోర్లు, 1 సిక్స్) అనుకున్నంత వేగంగా పరుగులు సాధించలేకపోయారు. 19వ ఓవర్లో పంత్ అవుట్ కావడం, ఆ వెంటనే షిమ్రన్ హెట్‌మెయిర్(1) కూడా వెంటనే అవుటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లో ఢిల్లీ జట్టు కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లతో రాణించగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశాడు.

3 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x