Friday, November 1, 2024

‘బెయిర్ స్టో టాయిలెట్లో ఉన్నాడేమో..’ రైజర్స్ ఓటమిపై సెహ్వాగ్ ట్రోల్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌పై అనేకమంది మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓపెనింగ్‌కు స్పెషలిస్ట్ ఓపెనర్ జానీ బెయిర్ స్టోను కాకుండా విలియమ్సన్‌ను వార్నర్ తీసుకెళ్లడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వార్నర్ ఐడియాపై తన స్టైల్లో విమర్శలు చేశాడు. సెహ్వాగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

సెహ్వాగ్ సాధారణంగానే క్రికెటర్లు చేసే తప్పిదాలపై ఆన్‌లైన్లో విమర్శలు గుప్పిస్తుంటాడు. అదే తరహాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కూడా పంచ్‌లు విసిరాడు. ‘ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బెయిర్‌ స్టో 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. మంచి హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ జరిగింది. కానీ ఆ సమయంలో బెయిర్ స్టోను వార్నర్ ఆడించలేదు. బహుశా బెయిర్‌ స్టో టాయిలెట్‌లో ఉండి ఉండవచ్చు. ఆ కారణం తప్ప అతడిని ఆడించకుండా విలియమ్సన్‌తో వార్నర్ ఓపెనింగ్ చేయడానికి వేరే కారణం నాకు కనిపించడం లేదు. హైదరాబాద్‌ పోరాట పటిమ కనబరిచింది. కానీ, వింతైన, అనూహ్య నిర్ణయాల కారణంగా ఓటమి చవి చూసింది. ఈ ఓటమికి కచ్చితంగా వారిని వారు నిందించుకోవాల్సిందే..’ అని వీరూ భాయ్ ఘాటు విమర్శలు చేశారు. అంతే కాకుండా వార్నర్‌ కెప్టెన్సీని తప్పుబట్టారు. సెహ్వాగ్‌ మాత్రమే కాకుండా ఇంగ్లండ్‌ మాజీ ఓపెనర్‌ నిక్‌ కాంప్టన్‌ సైతం ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ప్రపంచంలోని ప్రస్తుత బెస్ట్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన బెయిర్‌స్టో సూపర్‌ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌ చేయలేదని ప్రశ్నించాడు.


ఇదిలా ఉంటే ఐపీఎల్‌-2021లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్.. కేన్‌ విలియమ్సన్‌(62), జానీ బెయిర్‌స్టో(38) రాణించడం, చివర్లో సుచిత్(14) వరుసగా మూడు బౌండరీలు బాదడంతో మ్యాచ్‌లో నిలిచింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఆ జట్టు కూడా 159 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. దీంతో సూపర్‌ నిర్వహించారు. ఆ ఓవర్లో హైదరాబాద్‌ 7 పరుగులు చేయగా… ఢిల్లీ 8 పరుగులు చేసి విజయం సాధించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x