Monday, March 23, 2026

ఐపీఎల్‌‌కు కరోనా దెబ్బ.. ఒక్కొక్కరుగా దూరమవుతున్న ఆటగాళ్లు

ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 14వ సీజన్లో ఫ్రాంఛైజీలకు భారీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్లకు దూరం అవుతుండడంతో ఆయా ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా నేపథ్యంలో తాను జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కరోనా మహమ్మారి బారినపడి పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. పరిస్థితులు చక్కడిన తర్వాత మళ్లీ మైదానంలోకి దిగుతానని చెప్పాడు. ఈ మేరకు అశ్విన్‌ తన ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు.

కాగా.. ఇప్పుడు ఆటగాల్లను కోల్పోయే వంతు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు వచ్చింది. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడం జంపా ఐపీఎల్‌ 14వ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తాము స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. ‘వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆడమ్ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నారు. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు వారు అందుబాటులో ఉండరు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం వారి నిర్ణయాన్ని గౌరవిస్తోంది. వారికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుంది’ అని ట్విటర్‌ వేదికగా ఆర్సీబీ యాజమన్యం ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.


ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఆడుతున్న తమ ఆటగాళ్లను వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు అనుకుంటున్నాయట. అందులో ప్రధానంగా క్రికెట్ ఆస్ట్రేలియా పేరు వినిపిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఆటగాళ్లపై ఓ నిబంధన విధించిందని, ఇప్పుడు స్వదేశానికి తిరిగి రాకుంటే మరో 3 నెలల వరకు అనుమతించేది లేదంటూ అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పందట. దీంతోఆస్ట్రేలియా ప్రభుత్వ సూచన మేరకు సదరు ఆటగాళ్లు భారత్‌ నుంచి వెనక్కి వచ్చేయాలని సీఏ సూచించిందట. ఈ సూచనల నేపథ్యంలో ఆసిస్ ఆటగాళ్లంతా దేశం వదిలి వెళ్లనున్నట్లు సమాచారం.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -