Thursday, November 21, 2024

‘దానిపై ఉన్న ఆత్రుత కరోనాపై లేదా..? కేసీఆర్ సర్కార్ పై రాములమ్మ గుస్సా..

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. భూకబ్జా కేసులో ఆయనపై ఆరోపణలు రాగానే కేసీఆర్ సర్కార్ ఎంత హంగామా చేసిందో వేరే చెప్పక్కర్లేదు. అప్పటికప్పుడు అధికారులందరికీ ఆదేశాలు పంపి, నివేదికలు తెప్పించుకుని ఈటలను బర్తరఫ్ చేసేవరకు నిద్రపోలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కార్ పై మండి పడ్డారు. ఈటల వ్యవహారంలో చూపిస్తున్న ఆసక్తి కరోన కట్టడిలో సర్కార్ చూపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వాన్ని హై కోర్టు కూడా అనేకసార్లు మందలించిన ఎలాంటి మార్పూ రాలేదని అన్నారు. కానీ తాజా పరిణామాల్లో మాత్రం కేసీఆర్ సర్కార్ ఉరుకులు పరుగులతో దర్యాప్తు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పొట్ట చేశారు.

‘రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు… తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి కేసీఆర్ గారు విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు సహా సమస్త అధికార గణాన్నీ ఉరుకులు పెట్టించి దర్యాప్తు చేయించి నివేదికలు రప్పించారు. ఆ పని కోసం రికార్డుల తనిఖీలు, బాధితులను విచారించడం లాంటి పనులు చకచకా జరిగిపోయాయి. అవినీతిని సహించేది లేదన్నట్టుగా చూపిన అదే శ్రద్ధ, ఆ పట్టుదల కోవిడ్ కట్టడి విషయంలో ఎందుకు లేదు? గత కొద్ది రోజులుగా తెలంగాణలో కోవిడ్ కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మందలిస్తూనే ఉంది.

కానీ మొదటి విషయంలో చూపించిన అమితమైన ఆసక్తి, ఉత్సాహాలను ప్రజారోగ్యం విషయంలో ఎందుకు కనిపించడం లేదు? కరోనా కేసుల నియంత్రణ విషయంలో న్యాయస్థానం వేసిన అక్షింతలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందే తప్ప ఏ మాత్రం పట్టింపులేదు. ప్రజల పట్ల ఈ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది ఎన్ని మార్లు రుజువవుతున్నా అడిగే నాథుడు లేడనే గర్వంతో మిడిసిపడుతున్నారు. ఈ పరిణామాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x