టీమిండియాపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పెయిన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చీటింగ్ చేసి గెలిచిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించిన సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్ ముగిసి దాదాపు 6 నెలలు గడుస్తున్న ఈ తరుణంలో టిమ్ పైన్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో టీమిండియా తమ దృష్టి మళ్లించిందని, దానివల్లే తాము సిరీస్ ఓడిపోయామంటూ విచిత్రంగా మాట్లాడాడు.
”టీమిండియా మమ్మల్ని పక్కదారి పట్టించింది. అందులో ఆ జట్టు గొప్పగా ఆడింది. మూడో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా మొదట గబ్బాకు వెళ్లమని చెప్పారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా నాలుగో టెస్టును ఎక్కడ నిర్వహించాలా అనే ఆలోచనలో పడింది. ఇంతలో ఏమైందో కానీ మళ్లీ మనసు మార్చుకొని గబ్బాలో ఆడేందుకు టీమిండియానే ఒప్పుకుంది. దీంతో మా ఏకాగ్రతను దెబ్బతిన్నది. దానివల్లే మేం ఓడిపోయాం’ అంటూ ఓ విచిత్రమైన ఆరోపణ చేశాడు. అంతేకాదు టీమిండియా ఇలా చేయడాన్ని చీటింగ్‌గా పెయిన్ ఆరోపించాడు.
ఇక టిమ్ పెయిన్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఆరు నెలల క్రితం జరిగిన దాని గురించి ఇప్పుడు చెబుతున్నావా..? సిరీస్ ముగిసిన వెంటనే ఈ విషయం ఎందుకు చెప్పలేదు..?’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. మరో యూజర్ ‘మీరు చేసే చీటింగ్‌లలో మేమెంత” అంటూ చురకలేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్టు టీమిండియా దారుణంగా ఓడిపోయినా.. ఆ తరువాత అద్భుతంగా రిటర్న్ బ్యాక్ అయింది. రెండో మ్యాచ్ డ్రా చేసుకున్నా.. ఆ తరువాత రెండు టెస్టులనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.