Friday, November 1, 2024

పీసీబీని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఆమిర్.. మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్

పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్‌కు పాక్ క్రికెట్ హెడ్ కోచ్, సెలెక్టర్ మిస్బా ఉల్ హక్, పీసీపీలే కారణమంటూ రిటైర్మెంట్ సమయంలో ఆమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా మిస్బా ఆ పదవి నుంచి దిగిన నాడే తాను మళ్లీ జట్టులోకి రావడం గురించి ఆలోచిస్తానంటూ అనూహ్యమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో అప్పట్లో పాక్ క్రికెట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే తాజాగా ఆమిర్ వ్యాఖ్యలపై పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పాక్ క్రికెట్ బోర్డును, బోర్డు అధికారులను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కనేరియా తాజాగా విహర్శలు గుప్పించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన ఆమిర్.. ఇప్పుడు ఐపీఎల్ ఆడాలని అనుకుంటున్నాడని, దాని కోసం అతడు ఏకంగా బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నాడని సంచలన విషయాలు వెల్లడించాడు. ఆమిర్ తన అభిప్రాయం చెప్పడాన్ని తాను తప్పుబట్టడం లేదని, కానీ ఆమిర్ మాటలను బట్టి చూస్తే అతడు బోర్డు పెద్దల్ని బ్లాక్ చేస్తున్నాడనే అనుమానం కలుగుతోందని కనేరియా అన్నాడు.

‘ఆమిర్ ఇంగ్లండ్‌ వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ తీసుకుంటానని, దాని ద్వారా భారత్‌లోని ప్రతిష్ఠాత్మక క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో ఆడతానని అంటున్నాడు. దీనిని బట్టి అతని ఆలోచన తీరు అర్థం అవుతోందం”టూ కనేరియా చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడని గుర్తు చేశాడు.

కాగా.. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి 5ఏళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు గడిపాడు. నిషేధం తర్వాత మళ్లీ 7 ఏళ్ల తర్వాత పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రిలక పాత్ర పోషించాడు. కానీ.. గతేడాది పీసీబీ తనని మెంటల్ టార్చర్‌ పెడుతోందని, తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని వాపోతూ అనూహ్యంగా 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో పాక్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ జట్టు అభిమానులు కూడా షాకయ్యారు. కెరీర్లో పాక్‌ తరపున 36 టెస్టులు ఆడిన అమీర్ 119 వికెట్లు, 61 వన్డేలు ఆడి 81 వికెట్లు, 50 టీ20లు ఆడి 59 వికెట్లు తీశాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x