Wednesday, January 22, 2025

బతకాలంటే ఇక 10 మీటర్ల దూరంలో ఉండాల్సిందే..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు సూచించిన విషయాల ఆధారంగా కేంద్రం అనేక నిర్ణయాలను తీసుకుంటోంది. ముఖ్యంగా గాలి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరింస్తుండడంతో కేంద్రం తాజా మార్గదర్శకాలను వెల్లడించింది.

ముఖ్యంగా కరోనా మహమ్మారి తుమ్మినా, దగ్గినా తుంపర్లు సాధారణంగా రెండు మీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే చెబుతున్నారు. అంటే ఏరోసోల్స్‌(అతి సూక్ష్మమైన తుంపర్లు) ఏకంగా 10 మీటర్ల దూరం ప్రయాణం చేస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన నూతన మార్గ దర్శకాల్లో వెల్లడించింది. ఫలితంగా వైరస్‌ కట్టడి కోసం మాస్క్‌, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలని హెచ్చరించింది.

‘కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్‌ సోకే ముప్పును వెంటిలేషన్‌ తగ్గిస్తుంది. ఇంట్లో ఉండే కిటికీలు, తలుపులు వంటి ఎగ్జాస్ట్‌ సిస్టంతో చెడు వాసనలు బయటకు వెళ్లాయి. అలానే అదే ప్రాంతంలో ఫ్యాన్‌లు పెడితే వైరస్‌తో కూడిన గాలి బయటకు పోయి కోవిడ్‌ సోకే ముప్పు తగ్గుతుంది. అంతేకాదు లక్షణాలు లేని వ్యక్తులు కూడా వైరస్‌ని వ్యాప్తి చేస్తారు. కరోనా బారిన పడిన వారి నోరు, ముక్కు నుంచి బయటకొచ్చిన తుంపర్లలో పెద్ద తుంపర్లు నేలపై, తలుపు హ్యాండిల్స్, ఇతర వస్తువులపై పడతాయి. వీటివల్ల కరోనా వ్యాప్తి .జరుగుతుంది. ఇక చిన్న తుంపర్లు, అంటే ఏరోసోల్స్ గాలిలోనే ఉంటాయి. 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయ’ని సైంటిఫిక్ ఎంక్వయిరీ సూచించింది.

ఏసీలతో జాగ్రత్త:
ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో ఈ ఏరోసోల్స్‌ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్‌ బాగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచాలి. ఇక ఆఫీసుల విషయాలకొస్తే ఏసీలు వేసి, మొత్తం మూసేస్తారు. దానివల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

డబుల్ మాస్క్ బెస్ట్:
ఏరోసోల్స్ నుంచి తప్పించుకోవాలంటే 2 మాస్కులు వేసుకుంటే మంచిందని, సర్జికల్‌ మాస్క్‌తో పాటు కాటన్‌ మాస్క్‌ కలిపి పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఎన్‌ 95 మాస్క్‌ పెట్టుకుంటే మరింత మంచిందని సూచిస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x