Wednesday, January 22, 2025

రఘురామ కేసు 6 వారాలు వాయిదా.. ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వం తొలగింపు

తన తండ్రిపై సీఐడీ పోలీసు హింసకు పాల్పడ్డారని, కస్టడీలో ఆయనను కొట్టారని ఎంపీ రఘురామ తనయుడు భరత్ దాఖలు చేసిన పీటీషన్‌పై సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. భరత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. కాగా పిటిషన్‌లో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని కోరిన ఆయన.. తొలుత ప్రతివాదులుగా చేర్చిన ఏపీ ప్రభుత్వం, మంగళగిరి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్, సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఏసీపీ ఆర్‌ విజయపాల్‌లను ప్రతివాదులుగా తొలగించాలని దర్మాసనానికి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా తొలగించింది.

అయితే ఈ తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది, సీనియర్‌ లాయర్ దుష్యంత్‌ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని నివేదించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినలేదని, సీబీఐని ఏ రకంగా ప్రతివాదిగా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ప్రతివాది నంబర్‌ 1గా ఎవరిని చేర్చారు? ఏపీ ప్రభుత్వాన్ని ఇపుడు ఎందుకు తొలగిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ధర్మాసనానికి దవే నివేదించారు. అదే సమయంలో దవేకు ‘లోకస్‌ స్టాండీ’ లేదని, ఏపీ ప్రభుత్వాన్ని తొలగించాల్సిందేనని రోహత్గి పేర్కొన్నారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ.. ఈ ప్రొసీడింగ్స్‌ హాస్యాస్పదంగా ఉన్నాయని దవే అన్నారు.

కాగా.. దవే వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతివాదుల తొలగింపుపై వివరణ ఇచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రిస్క్‌ భరిస్తానని అంగీకరించారని పేర్కొంది. అలాగే ఈ కేసులో చాలా అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోందని, ఆసక్తి ఉన్న పార్టీల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని, కావాలనుకుంటే అప్లికేషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. కేంద్రం, సీబీఐలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ 6 వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులిద్దరూ కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x