ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి, అతడితో తన పరిచయం, పెళ్లి గురించి అతడి భార్య క్యాండిస్ వార్నర్ వివరించింది. అలాగే అతడి గురించిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గత వారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడిన క్యాండిస్.. పెళ్లికి ముందు రెండేళ్ల క్రితమే వార్నర్‌తో తనకు పరిచయం అయిందని, అది కూడా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తాము తొలిసారి కలుసుకున్నామని క్యాండిస్ చెప్పింది. ఆ సమయంలో వార్నర్ చాలా మొరటుగా, అహంకారిగా కనిపించాడని పేర్కొంది. వార్నర్ బయటికి కనిపించేంత ఆమాయకుడు కాదని, అప్పటికే ఓ గర్ల్ ఫ్రెండ్‌ను కూడా మెయింటైన్ చేసేవాడంటూ అసలు విషయం చెప్పేసింది.
తామిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే ప్రాంతంలో 500 మీటర్ల దూరంలో పెరిగామని, కానీ ఒకరికొకరు అసలు పరిచయం లేదని ఆమె చెప్పింది. అయితే వార్నర్‌కు తానే తొలిసారి మెసేజ్ చేశానని, ‘టీవీలో వార్నర్‌ను ఫస్ట్ టైం చూసినప్పుడు సోషల్ మీడియా వేదికగా తనకు నేనే మేసేజ్ చేశాను. అలా మొదలైన తమ ప్రేమ.. రెండేళ్ల పూర్తయ్యే సరికి వివాహానికి దారితీసింది. ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాం’ అని క్యాండిస్ వివరించింది. వార్నర్, క్యాండీస్‌ల వివాహం 2015లో జరగగా.. వారికి ముగ్గురు కుమార్తెలున్నారు.
ఇదిలా ఉంటే, కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే వాయిదా పడడంతో వార్నర్ స్వదేశం వెళ్లిపోయాడు. కఠిన క్వారంటైన్ నిబంధనలను పూర్తి చేసుకుని ఇటీవలే కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. కొద్ది రోజులుగా కుటుంబంతో జాలీగా గడుపుతున్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో మళ్లీ బిజీ షెడ్యూల్‌లో అడుగుపెట్టబోతున్నాడు. జూలైలో విండీస్‌లో పర్యటన, ఆ తర్వాత యూఏఈలో ఐపీఎల్, ఆ వెంటనే భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఇలా వరుస విదేశీ పర్యటనలతో ఊపిరాడకుండా గడపనున్నాడు.