Thursday, November 21, 2024

రషీద్ వీర విహారం.. లాస్ట్ బాల్‌కు లాహోర్ థ్రిల్లింగ్ విక్టరీ

గతేడాది నవంబర్‌లో కరోనా కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మళ్లీ మొదలైంది. యూఏఈ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం లాహోర్‌ కలండర్స్‌-ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ మధ్య ఓ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి బంతి వరకు విజయం రెండు జట్లతో దోబూచులాడింది. అయితే ఆఫ్ఘాన్ ఆటగాడు రషీద్ ఖాన్ చివర్లో మెరుపులు మెరిపించడంతో లాహోర్ కలందర్స్ థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసింది.

రషీద్‌ ఖాన్‌ కేవలం 5 బంతుల్లోనే 15 పరుగులు(3 ఫోర్లు)తో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన దశలో షాబాద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రషీద్‌ మూడు వరుస 3 ఫోర్లు బాదాడు. దీంతో జట్టుపై ఒత్తిడి తగ్గిపోయింది. అనంతరం నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రషీద్‌ ఖాన్‌.. ఐదో బంతికి సింగిల్‌ తీశాడు. ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో టిమ్‌ డేవిడ్‌ సింగిల్‌ తీయడంతో కలందర్స్‌.. పీఎస్‌ఎల్‌-6లో నాలుగో విజయాన్ని కైవసం చేసుకుంది. అలాగే రషీద్ అంతకుముందు బౌలింగ్‌‌లో కూడా అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులు ఇవ్వడమే కాకుండా ఓ వికెట్ కూడా తీసి ఇస్లామాబాద్‌పై జట్టుపై పట్టు బిగించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రషీద్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కాగా.. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఫహీమ్‌ అష్రఫ్‌(27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కలందర్స్‌ బౌలింగ్‌లో జేమ్స్‌ ఫాల్కనర్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కలందర్స్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కలందర్స్ తరపున కెప్టెన్‌ సోహైల్‌ అక్తర్‌ 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x