Wednesday, January 22, 2025

లోకేష్, చంద్రబాబులపై బూతులతో విరుచుకుపడ్డ మంత్రి కొడాలి

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని తిట్ల దండకం ఎత్తుకున్నారు. “చంద్రబాబూ..నీవు మనిషివేనా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?” అంటూ మంత్రి కొడాలి నాని తిట్లతో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేష్ లపై బూతులతో దండెత్తారు.

“పప్పుగాడు, తుప్పుగాడు ఇద్దరు ఇళ్లల్లో కూర్చుని ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో జూమ్‌ యాప్‌ పెట్టి.. ప్రజల్లో వైఎస్‌ జగన్‌పై ప్రజల్లో విషం నింపుతున్నారని మండిపడ్డారు. పేజీలకు పేజీలు లేఖలు రాసి ప్రెస్‌కు విడుదల చేయడం.. గ్రామ రాజకీయాలతో ఎవరో చనిపోతే ఈ పప్పుగాడు కర్నూలు వెళ్లి.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అరే.. ఒరే అని మాట్లాడుతున్నాడు.” అంటూ కొడాలి ఫైర్ అయ్యారు.

చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో హత్యలు జరగలేదా? వైయస్‌ఆర్‌సీపీ నేతల హత్యలకు చంద్రబాబు బాధ్యత వహిస్తాడా..? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎక్కడో గ్రామాల్లో జరిగే గొడవలను సీఎంకు ఆపాదించడం కరెక్టు కాదన్నారు. చంద్రబాబు.. కొడుకుని అచ్చొచ్చిన అంబోతులా రోడ్లపైకి వదిలాడని, ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తండ్రీకొడుకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బడిత పూజ చేస్తారని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అంతే కాకుండా.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులకు బకాయిలు కట్టకుండా వదిలేస్తే.. తామెచ్చిన తరువాత ఆ బకాయిలు చెల్లించామని, రూ.996 కోట్లు రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు సీఎం వైఎస్‌ జగన్‌ చెల్లించారని కొడాలి తెలిపారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు అన్ని కలిపి దాదాపు రూ.4 వేల కోట్లు చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన బాకీలను 2019లో సీఎంగా బాధ్యతలు తీసుకున్న 3 నెలల్లో జగన్ చెల్లించారని తెలిపారు. అలాంటి సీఎంపై విషం కక్కుతావా..? అంటూ మాజీ సీఎం చంద్రబాబుపై కొడాలి నిప్పులు చెరిగారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x