Friday, November 1, 2024

కోవిడ్ సెకండ్ వేవ్.. వస్తే ఆ 3 మార్గాల్లోనే..?

కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందా..? రాదా..? అనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం.. కరోనా కట్టడి నిబంధనల్ని పటిష్ఠంగా పాటించకపోతే మూడో దశ తప్పదని, అందులోనూ అక్టోబర్‌-నవంబరు మధ్య గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో కోవిడ్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం కూడా అనేకరకాలుగా.. ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గణిత పద్ధతుల్లో కొవిడ్‌-19 వ్యాప్తిని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందంలో సభ్యుడిగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్‌.. కోవిడ్ థర్డ్ వేవ్ గురించి అనేక కీలక విషయాలను వెల్లడించారు.

‘సూత్ర మోడల్‌’ను అభివృద్ధి చేసిన ఈ బృందం మూడో వేవ్‌ సంభావ్యతను మూడు రకాలుగా అంచనా వేసింది. ఒక్కో రకంలో కేసుల విజృంభణ ఎలా ఉండబోతోందో తెలిపింది. అందులో మొదటగా.. ఆప్టిమిస్టిక్‌(ఆశాజనక పరిస్థితులు) ఎస్సెస్‌మెంట్ ప్రకారం.. జీవన పరిస్థితులు ఆగస్టు నాటికి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కొత్త వేరియంట్లు ఏవీ రావు. రోజువారీ కేసులు 50 వేల నుంచి లక్ష మధ్యలో మాత్రమే నమోదవుతాయి. ఇక రెండోది ఇంటర్మీడియెట్‌(మధ్యస్థ పరిస్థితులు) అంచనా ప్రకారం.. ఆప్టిమిస్టిక్‌ పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్‌ 20 శాతం తక్కువ ప్రభావం చూపితే.. పరిస్థితులు కొంత ఆందోళనకరంగా మారతాయి. అయితే ఈ పరిస్థితుల్లోనూ రోజువారీ కేసులు 50 వేల నుంచి లక్ష మధ్యలో మాత్రమే నమోదవుతాయి. కానీ, ఆప్టిమిస్టిక్‌ పరిస్థితులతో పోల్చితే ఎక్కువగానే నమోదవుతాయి. ఇక మూడోది ప్రమాదకరమైన అంచనా. అదే పెసిమిస్టిక్‌(నిరాశజనక పరిస్థితులు) అంచనా. ఈ పరిస్థితుల్లో 25 శాతం అధిక సంక్రమణ సామర్థ్యం ఉన్న వైరస్‌ ఆగస్టులో వ్యాప్తి చెందుతుంది. అయితే, అది డెల్టా ప్లస్‌ మాత్రం కాదు. కేసుల విషయానికి వస్తే రోజుకి 1,50,000 నుంచి 2,00,000 వరకు నమోదై ప్రజలను భయాందోళనలకు గురి చేస్తాయి. రెండో వేవ్‌ గరిష్ఠ స్థాయిల్లో నమోదైన కేసులతో పోలిస్తే ఇది సగం.

కట్టడికి మార్గాలివే..
కాగా.. పైన పేర్కొన్న మూడు అంచనాల కంటే మెరుగ్గా ఉండాలన్నా.. కోవిడ్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో నిరోధించాలన్నా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరింత వేగంగా కొనసాగాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే మూడు, నాలుగో వేవ్‌లు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ బృందంలో మరో సభ్యుడైన ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్త విద్యాసాగర్‌ కూడా వ్యాక్సినేషన్‌ వేగంగా సాగాలన్నారు.వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య పెరిగే కొద్దీ.. కోవిడ్ ముప్పు తగ్గుతూ వస్తుందన్నారు. దీనికి బ్రిటన్ దేశమే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఇంతటి ఆందోళనలోనూ కొంత ఉపశమనం ఏంటంటే.. రెండో వేవ్‌లో నమోదైన రోజువారీ కేసులతో పోలిస్తే మూడో వేవ్‌లో సగం మాత్రమే కేసులు రికార్డవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సంక్రమణ సామర్థ్యం అధికంగా ఉన్న వైరస్‌లు వెలుగు చూస్తే మూడో వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందట. ఈ విషయాలను కూడా సదరు బృందంలోని శాస్త్రవేత్తలే వెల్లడించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x