న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూపర్ మ్యాన్‌లా మారాడు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను బ్యాట్‌మ్యాన్ అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ వండర్ ఉమెన్‌లా రూపాంతరం చెంది. ఇక పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ అజాం ఫ్లాష్‌గా, విండీస్ విధ్వంసక వీరుడు పొలార్డ్ సైబోర్గ్‌గా సెట్ అయ్యారు. ఇక వీరితో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఓ సూపర్ హీరోలా మారాడు. ఇంతకీ మన కోహ్లీ ఎవరిలా మారాడో తెలుసా..? అక్వామ్యాన్. హాలీవుడ్ సినిమా జస్టిస్ లీగ్‌లోని ఈ రోల్స్‌లో క్రికెటర్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఆ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షేర్ చేసింది. దీనికి ‘యునైట్ ద లీగ్(బృందాన్ని ఒక్కటి చేయండి)’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. కాగా.. విరాట్ కోహ్లీ ఆక్వామ్యాన్ రూపంలో ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఐసీసీ ఎప్పటికప్పుడు ఫన్నీ మీమ్స్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటుంది. క్రికెటర్లపై, క్రికెట్ మ్యాచ్‌లపై ఉండే ఈ మీమ్స్ క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే జస్టిస్ లీగ్ థీమ్‌తో క్రికెటర్ల ఫోటోలను ఇలా మార్ఫ చేసి షేర్ చేసింది. ఈ ఫోటోపై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అక్వామ్యాన్ ఫేస్‌కు కోహ్లీ సరిగ్గా సరిపోయాడని కొందరు అంటుంటే.. కోహ్లీ సూపర్ మ్యాన్ కావాల్సిందని మరికొందరు అభిప్రాయపడతున్నారు.
Unite the League 💪#SnyderCut pic.twitter.com/kNPI8simBg
— ICC (@ICC) March 18, 2021
ఇదిలా ఉంటే పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఈ మధ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20ల్లో విరాట్ కోహ్లీ 3000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. టీ20ల్లో 744 పాయింట్లతో విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 870 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో, టెస్టుల్లో 814 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.