Friday, November 1, 2024

శోభనం గది నుంచి కేకలేస్తూ పరిగెత్తుకొచ్చిన వరుడు.. అసలు విషయం తెలిసి అంతా షాక్

ప్రతి యువకుడికి అందమైన యువతిని పెళ్లిచేసుకోవాలని, సంతోషంగా కాపురం చేయాలని ఉంటుంది. పెళ్లితంతు ముగిశాక శోభనం కోసం ఇరువురూ ఎంతో ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అయితే ఓ యువకుడికి ఆ కల కల్లగా మారింది. శోభనం రాత్రే కాళరాత్రిగా మిగిలింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ వరుడికి.. మొదటి రాత్రి రోజే భార్య గురించి ఓ భయంకరమైన నిజం తెలిసింది. ఎంతో ఆశతో స్వర్గ సుఖాలు అనుభవిద్దామని లోపలికెళ్లి అసలు విషయం తెలిసి షాక్ తిన్నాడు. పరిగెత్తుకుంటూ బయటకొచ్చి అందరికీ విషయం చెప్పడంతో ఈ సారి షాక్ తినడం వారి వంతయింది. దీంతో అంతా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో పంకి(23) యువకుడు తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులు చూసిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు ఆ నవ జంటకు శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఎంతో ఆసక్తిగా గదిలోకి వెళ్లిన యువకుడు.. అసలు విషయం తెలిసి బెడ్ రూమ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే తేరుకుని గదిలోంచి పెద్దగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తాను పెళ్లి చేసుకున్న యువతి హిజ్రా అని, యువతి తరుపు వాళ్ళు తమను మోసం చేశారంటూ వాపోయాడు.

దీంతో అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను మోసం చేశారని, హిజ్రాను తనకిచ్చి పెళ్లి చేశారంటూ యువకుడు వాపోయాడు. తనను మోసం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతికి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు కూడా ఆమె హిజ్రా అని తేల్చేశారు. చివరికి ఆ యువతిని తిరిగి ఆమె ఇంటికి తీసుకెళ్లేలా పోలీసులు ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం చేసి పంపించేశారు. అయితే తాజాగా ఈ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. తమ కూతురును ఇంటికి తీసుకెళ్లాలంటూ యువకుడిపై, అతని కుటుంబంపై సదరు హిజ్రా తలిదండ్రులు ఒత్తిడి చేశారు. యువతితో అతనిపై పోలీసు ఫిర్యాదు కూడా చేయించారు.

కాగా, యువతిని తీసుకెళ్లకపోతే దాడులు చేస్తామని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సదరు పెళ్ళికొడుకు చెబుతున్నాడు. మొత్తానికి ఈ వ్యవహారం మళ్లీ పోలీసుల వద్దకు చేరడంతో మళ్లీ వార్తల్లోకెక్కింది. దీంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. విడాకులు తీసుకోవాలనుకుంటే కోర్టుకు వెళ్లాలని పెళ్లి కొడుకుకు పోలీసులు సూచించారు. ఈ వ్యవహారం శివపురి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x