Sunday, March 22, 2026

డివిలియర్స్ టీమ్ లో కెప్టెన్ గా ధోని, రైనాకు నో..!

చెన్నై: అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 2021 సీజన్‌ హంగులు అద్దుకుంటుంది. ఐపీఎల్ ఆడేందుకు ప్రపంచ ఆటగాళ్లందరూ భారత్ కు చేరుకున్నారు. అయితే తాజాగా ఆర్‌సీబీ పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్‌ని ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేశాడు. అలాగే వికెట్‌ కీపర్‌గా కూడా అతడినే సెలెక్ట్ చేశాడు. ఇక ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌తో పాటు డివిలియర్స్‌ తన పేరును కూడా ప్రకటించడం విశేషం. ఆల్‌రౌండర్ల కోటాలో బెన్‌ స్టోక్స్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు.

అలాగే పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడలకు అప్పగించాడు. స్పిన్ బౌలింగ్ బాధ్యతల కోసం రషీద్ ఖాన్, జడేజాను పరిగణలోకి తీసుకున్నాడు. అయితే ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై వేదికగా సీజన్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. కాగా డివిలియర్స్‌ తన బెస్ట్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ టీమ్‌ కెప్టెన్‌గా జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన రోహిత్‌ శర్మను కాదని ధోనికే ఓటు వేయడం ఇక్కడ విశేషం. అయితే ఐపీఎల్‌లో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా పేరున్న సురేశ్‌ రైనాకు మాత్రం ఏబీ టీమ్‌లో చోటు దక్కలేదు.

ఏబీడీ ఆల్‌టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్‌స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్‌స్టోక్స్, ఎంఎస్‌ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబడ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -