Monday, March 23, 2026

సెంచరీలతో విరుచుకుపడి.. కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ సరికొత్త రికార్డును సృష్టించాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్‌ నిలిచాడు. బాబర్ ఈ రికార్డును దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా నెలకొల్పాడు. ఇంతకుముందు కోహ్లి 13 వన్డే సెంచరీలు చేయడానికి 86 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. హషీమ్‌ ఆమ్లాకు 83 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా బాబర్‌ అజమ్‌ మాత్రం 76 ఇన్నింగ్స్‌ల్లోనే 13 వన్డే సెంచరీలు చేసి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌ భారి థ్రిల్లర్‌ సినిమాను తలపించింది. ఆఖరి బంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడి చివరికి పాక్‌ ను వరించింది. పాక్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 273 పరుగులు సాధించింది. అయితే 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికాను డస్సెన్‌ అజేయ శతకం (134 బంతుల్లో 123 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో ఆదుకున్నాడు. డస్సెన్, మిల్లర్‌ (50; 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఇక బ్యాటింగ్ కు వచ్చిన పాక్ జట్టు ముందు274 పరుగుల భారీ లక్ష్యం ఉంది. అయితే పాక్‌ సరిగ్గా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. చివరి ఓవర్ సమయానికి పాకిస్తాన్‌ 6 వికెట్లు కోల్పోగా విజయానికి కేవలం మూడు పరుగులు కావాలి.

ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ వేసిన దక్షిణాఫ్రికా పేసర్‌ ఫెలుక్వాయో తొలి బంతికి షాదాబ్‌ ఖాన్‌ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్‌)వికెట్ తీశాడు. తర్వాతి మూడు బంతులకు ఫెలుక్వాయో ఒక్క పరుగూ ఇవ్వలేదు. దాంతో పాక్‌ విజయ సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. అప్పుడు ఫాహిమ్‌ అష్రఫ్‌ (5 నాటౌట్‌) ఐదో బంతికి రెండు పరుగులు, చివరి బంతికి ఒక పరుగు సాధించి పాకిస్తాన్‌కు విజయాన్ని అందించాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -