Sunday, March 22, 2026

ఇండియా తరపున ఒక్కడే మొనగాడు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో..

టీమిండియా తరపున ఒకే ఒక్క మొనగాడిగా అశ్విన్ నిలిచాడు. టెస్టుల్లో ఏకైక టీమిండియా బౌలర్‌గా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నిలిచాడు. టాప్ టెన్‌లో ఒకే ఒక్క టీమిండియా ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్ తన ర్యాంకును నిలబెట్టుకున్నాడు. అశ్విన్ తప్ప మరే బౌలర్ కూడా టాప్ టెన్‌లో స్థానం సంపాదించుకోలేకపోయారు.

తాజా ర్యాంకింగ్స్‌లో పాక్‌ బౌలర్లు కీలక ర్యాంకులు సాధించారు. పాక్ తరపున కెరీర్ బెస్ట్ ర్యాంకులు సాధించారు. హసన్‌ అలీ, షాహిన్‌ ఆఫ్రిది, నుమాన్‌ అలీలు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తమ కెరీర్‌ బెస్ట్‌ను అందుకున్నారు. హసన్‌ అలీ 6 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలవగా.. షాహిన్‌ ఆఫ్రిది ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. ఇక నుమాన్‌ అలీ 8 స్థానాలు ఎగబాకి 46వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

వీరితో పాటు టీమిండియా నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కడే టాప్‌ టెన్‌లో నిలిచాడు. అశ్విన్‌(850 పాయింట్లు)తో రెండో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇక బుమ్రా తరువాత మరే బౌలర్‌కు కూడా టాప్ టెన్‌లో స్థానం దక్కలేదు. అశ్విన్ తరువాత టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఒక్కడే 11వ స్థానంలో నిలిచాడు. కాగా.. బౌలర్లలో టాప్ ప్లేస్‌లో కమిన్స్‌(908 పాయింట్లు), నీల్‌ వాగ్నర్‌( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి కోహ్లి ఐదో స్థానంలో నిలవగా.. రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మలు కలిసి ఆరో స్థానాల్లో నిలిచారు.

ఇక జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది పాకిస్తాన్. ఈ విజంయంలోనే హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, నుమాన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురు 5 వికెట్లు తీసి సత్తా చాటారు. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో హసన్‌ అలీ(5-27) సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రిది(5-52), నుమాన్‌ అలీ(5-86)లు అదరగొట్టారు. అంతే కాదు ఏకంగా 28 ఏళ్ల తర్వాత ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -