చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఓటమి గురించి అలా ఉంచితే.. ఆ జట్టు కీలక బౌలర్ హర్షల్ పటేల్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన సీజన్ మొత్తంలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టి.. ఏకంగా 15 వికెట్ల తీసుకున్నాడు హర్షల్. దీంతో అతడికి పర్పుల్ క్యాప్ కూడా దక్కింది. అయితే చెన్నైతో మ్యాచ్‌లో ఏమయిందో ఏమో.. దారుణంగా బౌలింగ్ వేశాడు. అతడి బౌలింగ్‌లో సీఎస్‌కే బ్యాట్స్‌మన్ పరుగుల వరద పారించారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును హర్షల్ సమం చేశాడు.
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్.. ఒకే ఓవర్‌లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో మొదటి మూడు ఓవర్లలో హర్షల్ ఎప్పటిలానే చాలా పొదుపుగా బౌలింగ్ చేసి సీఎస్‌కే బ్యాట్స్‌మన్ పూర్తి స్థాయిలో కట్టడి చేశాడు. కేవలం 14 పరుగలు మాత్రమే ఇచ్చాడు. మూడు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్‌లో చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాట్‌తో విశ్వరూపం చూపించడంతో హర్షల్ తేలిపోయాడు. జడేజా ధాటికి అతను 5 సిక్స్‌లు, ఒక ఫోర్, డబుల్ నోబాల్‌తో కలిపి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ దారుణ ఓవర్‌తో.. 2011 సీజన్‌లో కొచ్చి టస్కర్స్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ పేరిట ఉన్న 37 పరుగుల చెత్త రికార్డును హర్షల్ సమం చేశాడు. అప్పట్లో క్రిస్ గేల్ ధాటికి పరమేశ్వరన్ ఒకే ఓవర్‌లో 37 పరుగుల సమర్పించుకున్నాడు. పరమేశ్వరన్ బౌలింగ్‌లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు బాది 36 పరుగులు పిండుకున్నాడు. ఇందులో ఒక నోబాల్ ఉంది. ఇక ఈ మ్యాచ్ హర్షల్ అదే స్థాయిలో పరుగులు ఇచ్చుకున్నాడు. అంతేకాదు అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను(15 వికెట్లు) కలిగిన ఓ బౌలర్ ఒకే ఒవర్లో ఇన్ని పరుగులు సమర్పించుకోవడం కూడా ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.