Thursday, November 21, 2024

నాలుగో టీ20 భారత్‌దే..

అహ్మదాబాద్: టీమిండియా సెంటిమెంట్ బ్రేక్ చేసింది. ఛేజింగ్ టీం గెలుస్తుందన్న నమ్మకాన్ని బద్దలు కొడుతూ ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బౌలింగ్‌తో సత్తా చాటి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు మొదట్లోనే దెబ్బ తగిలింది. జోస్ బట్లర్(9) వెంటనే అవుటయ్యాడు. కానీ మరో ఓపెనర్ జేసన్ రాయ్(40: 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. కానీ అర్థ సెంచరీకి కొద్ది దూరంలో మళ్లీ అవుటైపోయాడు. ఆ తరువాత మలాన్(14), జానీ బెయిర్‌ స్టో(25), త్వరగానే అవుటయ్యారు. కానీ ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(46: 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో ఇంగ్లండ్ పతనం ప్రారంభమైంది.

వెంటనే కెప్టెన్ మోర్గాన్(4), శామ్ కర్రాన్(3) అవుటయ్యారు. చివర్లో జోఫ్రా ఆర్చర్(18) చివరి ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టి కొద్దిగా టెన్షన్ పెంచాడు. అయితే చివరికి భారత బౌలర్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటుతో ఆకట్టుకోలేకపోయినా.. బౌలింగ్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడంటేనే అతడు ఎంత బౌలింగ్‌ ఎంత గొప్పగా సాగిందో చెప్పవచ్చు. కాగా.. ఇండియన్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, రాహుల్ చాహర్, పాండ్యా 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీసుకున్నాడు.

తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(57) అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఓపెనర్లు, రోహిత్ శర్మ(12), కేఎల్ రాహుల్(14) వెంటవెంటనే అవుటైనా సూర్యకుమార్ యాదవ్ క్రీజులో పాతుకుపోయి చక్కగా ఆడాడు. కాగా.. గత మూడు మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ ఈ మ్యచ్‌లో కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీ(1) కూడా అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంప్ అవుట్‌గా వెనుతిరిగాడు. స్కైకు రిషబ్ పంత్(30) చక్కగా సహకరించాడు. స్కై అవుటైన తరువాత క్రీజులోకొచ్చిన శ్రేయాస్ అయ్యర్(37) మొదట నెమ్మదిగా ఆడినా.. ఆ తరువాత బ్యాటు ఝుళిపించాడు.

కాగా.. హార్దిక్ ప్యాండ్యా(11) కూడా మార్క్ ఉడ్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో బౌండరీ కొట్టబోయి బెన్ స్టోక్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుతిరిగాడు. చివరిగా శార్దూల్ ఠాకూర్(10) కూడా రెండు బౌండరీలు బాదడంతో టీమిండియా 180 దాటింది. చివర్లో వాషింగ్టన్ కూడా తొలి బంతికి బౌండరీ బాది, రెండో బంతికి అవుటయ్యాడు. అయితే ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీయగా, రషీద్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్ తలా ఒక వికెట్ దక్కాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x