ఐపీఎల్ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ నితీష్ రాణా విచిత్రమైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో రాణా చివరి 6 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 0, 81, 0,87,0,80 పరుగులు సాధించాడు. అంతేకాదు ‘0’ పరుగులకు అవుటైన ప్రతిసారీ తొలి బంతికే అవుటయ్యాడు. అంటే గోల్డెన్ డక్ అన్నమాట. ఇక రికార్డు విషయానికి వస్తే.. సరి, బేసి విధానంలో 3 సార్లు గోల్డెన్ డక్.. మరో 3 సార్లు 80కి పైగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం రాణా సాధించిన ఈ రికార్డుపై నెటిజన్లు విపరీతంగా పోస్ట్‌లు పెడుతున్నారు. డకౌట్‌లు అయిన మ్యాచ్‌ల గురించి పక్కన పెడితే పరుగులు చేసిన మ్యాచ్‌లలో మాత్రం జట్టును ముందుండి నడిపించాడని, కీలక పరుగులు చేశాడని ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉంటే తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు నితీశ్ రాణా(80: 56 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు), శుభ్‌మన్ గిల్(15: 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. పవర్ ప్లే పూర్తయిన తర్వాత గిల్ అవుటైనా.. వన్ డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(53: 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లలోనే 145 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ అవుట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత దినేశ్ కార్తిక్(22 నాటౌట్: 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప మిగతా బ్యాట్స్‌మన్ ఎవరూ రాణించలేదు. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు మాత్రమే చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించి ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది. 188 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్ రైజర్స్‌ను కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండో ఓవర్లోనే భారీ దెబ్బ కొట్టాడు. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(3)ను అవుట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. ఆ తరువాతి ఓవర్లో స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ కూడా మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(7)ను క్లీన్ బౌల్డ్ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే(61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), బెయిర్ స్టో(55: 40 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ, ఇన్నింగ్స్ 13వ ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని కట్ చేయబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రాణా చేతికి చిక్కాడు. దీంతో వారిద్దరి భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మహ్మద్ నబీ(14), విజయ్ శంకర్(11)తో కలిసి మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. అప్పటికే చేయాల్సిన స్కోరు భారీగా పెరిగిపోయింది. మనీష్ పాండే చివరి వరకు నాటౌట్‌గానే నిలిచినా.. భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసి 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.