Friday, November 1, 2024

నాడు పరిమళ్.. నేడు స్వామా.. జగన్ ప్లానేంటి!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి చాలా చిత్రవిచిత్రాలుగా ఉంటాయని సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ ఇది. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకుంటారనే అపవాదు ఎప్పట్నుంచో ఉంది. అయితే అప్పట్లో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వ్యక్తి పరిమళ్ నత్వానిని ఏపీ తరఫున (వైసీపీ) రాజ్యసభకు పంపారు. ఈ ఎన్నిక పూర్తయ్యి చాలా రోజులే అయినా ఇంతవరకూ ఏపీ సమస్యల గురించి పెద్దల సభలో పరిమళ్ మాట్లాడిన దాఖలాలు మాత్రం ఇంతవరకూ ఎక్కడా కనిపించలేదు. అయితే ఆయనకే ఎందుకు సీటిచ్చారు..? రాజ్యసభకు పంపి ఏం సాధించాలని జగన్ అనుకున్నారో తెలియదు. మరోవైపు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీనే స్వయంగా వచ్చి జగన్‌ను కలవడంతో మారుమాట చెప్పకుండా రాజ్యసభ పరిమళ్‌కు ఇచ్చేశారు.

తాజాగా బీజేపీ కీలక నేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, వివాదాలంటే ముుందుగా గుర్తొచ్చే వక్తి సుబ్రమణ్యం స్వామి. ఈయను పదవీకాలం 2022తో ముగియనుంది. ఆ తర్వాత వైసీపీ తరఫున ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని విశ్వసనయీ వర్గాల సమాచారం. ఎందుకంటే శత్రువు.. శత్రువు మిత్రుడే అన్న చందంగా.. ఓ ప్రముఖ దినపత్రిక అంటే జగన్‌కు పడదు. ఆ పేపర్‌ను, టీవీ చానెల్‌ను టార్గెట్ చేయడం.. అంతా జగన్ చెప్పినట్లే స్వామి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అప్పుడెప్పుడో జరిగిన ఓ సంఘటనను పట్టుకుని పరువు నష్టం దావా వేయడమేంటి..? అది కూడా వంద కోట్లు..? కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వాస్తవానికి స్వామి అంటే ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ఛీ కొడుతున్నారు. ఆయన చేస్తున్న పనులకు నేతలు విస్మయానికి గురవుతున్నారు. అయితే జగన్ మాత్రం ఆయన్ను ఢిల్లీ నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో రప్పించి.. ఆ ఖర్చంతా తానై భరించి మరీ సత్కరిస్తుండటంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కథే ఉందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి చూస్తే.. అప్పుడు పరిమళ్ నత్వానికి.. ఇప్పుడు స్వామిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపుతున్నారన్న మాట. ఇందులో నిజానిజాలెంత..? అసలు జగన్ ప్లానేంటి..? అన్నది మున్ముందు తేలుతుంది మరి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x