జస్ప్రీత్ బుమ్రా, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ వివాహం సోమవారం వైభవంగా జరిగింది. వీరి పెళ్లి విశేషాలు ఇప్పడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. అయితే ఫస్ట్ నుంచి కూడా వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచారు. అలాగే పెళ్లి కూడా ఉన్నట్లుండి చేసుకున్నారు. అయితే తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా బుమ్రా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే బుమ్రా షేర్ చేయకపోయినా.. ఓ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బుమ్రా, సంజనలకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను ఫాన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఈ బుమ్రా, సంజనలు ఓ రొమాంటిక్ సాంగ్‌కు లయబద్ధంగా డాన్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సంగీత్ ఫంక్షన్‌లో బుమ్రా-సంజన డ్యాన్స్ చేసిన వీడియో ఇది. ఇందులో కొత్త జంట ఆనందంగా ఒకరికొకరు ఆనందంగా డాన్స్ చేస్తూ నవ్వులు పూయించారు. కాగా పుణెకు చెందిన సంజనా గణేశన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను గెలుచుకున్నారు. అదే విధంగా, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా కూడా నిలిచారు. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి ప్రేమను కుటుంబాలకు తెలియజేసి, వారిని ఒప్పించి ఒక్కటయ్యారు.